వృద్ధ దంపతుల ఆత్మహత్య
Published Mon, Mar 6 2017 10:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement