manciryala
-
వరద నీటిలో చిక్కుకున్న మహిళా
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంచిర్యాల: రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొలవేని రమేశ్(35) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులపై కేసీఆర్ చిన్నచూపు
మంచిర్యాల సిటీ: జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ సమస్య అ త్యవసరమని తెలిసి కూడా, సీఎం కేసీఆర్ దశలవారీగా రుణాలను రద్దుచేయడాన్ని బట్టి ఆ యనకు రైతులపై ఉన్న చిన్నచూపును అర్ధం చేసుకోవచ్చన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే ఉచిత విద్యుత్‌తో పాటు, రుణమాఫీ దస్త్రాలపై సంత కం చేసిన విషయూన్ని తెలంగాణ రైతులు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని ప్రతి రైతు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. విద్యార్థుల భోధన రుసుములను ఒకేసారి చెల్లించకుండా పేదవారు చదువులకు దూరమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సమస్యలపై దశలవారిగా ఉద్యమాలు చేసి ప్రజలకు తమ పార్టీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ థామస్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు జాన్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా నాయకులు నరేందర్, జమీల్‌బాబా, ఉన్నారు. మిషన్ కాకతీయతో ఫలితం శూన్యం జన్నారం: ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా రైతులకు జరుగుతున్న లబ్ధి శూన్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆ రోపించారు. శనివారం జన్నారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకం కింద జిల్లాలో ఎంపికైన చెరువుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నా రు.బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలన్నారు. పార్టీకి పూర్వవైభవం తెస్తాం జిల్లాలో వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం వస్తుందని అనిల్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిల అధ్యక్షతన జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి పట్టణాలలో పార్టీ క్యాడర్‌ను పెంచామన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, అధికార ప్రతినిధి చంద్రయ్య, మండల అధ్యక్షుడు రాజునాయక్ పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ..
మంచిర్యాల టౌన్ : తగ్గుముఖం పట్టిందనుకున్న స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. తాజాగా మరో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు పాజిటివ్‌గా రావడంతో ఒక్కసారిగా జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అరుు్యంది. వారిలో ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా.. మరో ముగ్గురు తాజాగా వ్యాధి బారిన పడ్డారు. మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వంగపల్లి సాగర్‌రావు (53), ఏసీసీకి చెందిన కుక్క మేరి(27) ఈ నెల 9వ తేదీన స్వైన్ ఫ్లూ లక్షణాలతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఇద్దరికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో సాగర్‌రావు గత రాత్రి ఇంటికి వెళ్లగా హుటాహుటినా ఆస్పత్రికి పిలిపించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా.. మందమర్రి దీపక్‌నగర్‌కు చెందిన బెల్లారపు భారతి (35)కి కూడా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో మందమర్రి నుంచి ఆమె నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో ప్రస్తుతం మేరీ, సాగర్‌రావు చికిత్స పొందుతున్నట్లు వైద్యుడు నీలకంఠేశ్వర్రావు తెలిపారు. -
ఓట్ల కట్టలు!
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ క్రైం : బల్దియా ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడనుంది. పక్షం రోజులకుపైగా మైకుల హోరు.. నాయకుల పాదయత్రలు.. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చేసిన ప్రచార జోరుకు బ్రేక్ పడనుంది. ప్రచారానికి ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థులు తమ మద్దతుదారులను డప్పు చప్పుళ్లతో వీధి వీధి, ఇంటింటికి ఉదయం, సాయంత్రం తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మద్దతుదారులకు మధ్యాహ్నం బిర్యానీ తినిపిస్తూ.. కూలీకి డబ్బులు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికలు రెండు రాత్రులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి గుట్టుగా తమ అనుయాయాయులతో మగవారికి డబ్బులు.. మహిళలకు చీరలు, స్టీల్ పాత్రలు, ఇత్తడి బిందెలు.. వంట సామగ్రి అందజేస్తున్నారు. డబ్బులు ఇస్తూ ఓటు తప్పకుండా వేయాలని ప్రమాణం కూడా చేయించుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో వ్యాయామ సామగ్రి, మద్యం బాటిళ్లు, చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనం.అన్ని రాజకీయ పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కలిసొచ్చిన ఉగాది.. ఎన్నికల నిబంధనలతో ప్రచారానికి తెరపడినా ఓటర్లు తమకే మద్దతిచ్చే దిశగా అభ్యర్థులు, నాయకులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఎన్నికకు ముందు శనివారం రావడం, పోలింగ్‌కు మరుసటి రోజు ఉగాది పర్వదినం కావడం అభ్యర్థులకు కలిసొచ్చింది. ఆదివారం సెలవు, సోమవారం పండగ కావడంతో ఓటర్లు ఇళ్లకు వస్తారని అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు తీసుకుని ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాను, పోను బస్ చార్జీలు భరిస్తామని హామీ ఇస్తున్నారు. ముందుగానే డబ్బులు తమ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒక కుటుంబంలోని ఓట్లను గంపగుత్తగా మాట్లాడుకొని ఆ కుటుంబ ముఖ్యుడి ఖాతాలో సొమ్ము వేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతోపాటు ప్రత్యక్ష ప్రచారం చేసుకునే అవకాశం లేకపోయినా ఓటర్లను చేరుకునే మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఎస్ఎంఎస్, ఇంటర్నెట్, ఫేస్బుక్ వంటి మార్గాల ద్వారా ఓటర్లను తమకే ఓటువేయాలని గుర్తు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు పొదుపు సంఘాల నిర్మాణం, ఇప్పటికే భవనాలు ఉంటే వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడుతామని ముఖ్యనాయకులు వాగ్దానం చేస్తున్నారు. యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారు. చైర్మన్ అభ్యర్థులు ఓటుకు రూ.2వేలు.. కౌన్సిలర్ అభ్యరుథలు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థుల వార్డుల్లో అయితే ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతోంది. సాధారణ ఎన్నికలను తలదన్నేలా మున్సిపల్ పోరు మారుతోంది. నెల రోజుల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఈ ఎన్నికల ప్రాధాన్యం పెరిగింది. ప్రచారానికే ఒక్కో అభ్యర్థి రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారానికే ఖర్చు తడిసిమోపెడవుతున్నా అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం విశేషం. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా తీవ్రమైన పోటీ ఉన్న వార్డుల్లో 100 నుంచి 200 ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. అలాంటి ఓట్ల కోసం కచ్చితమైన హామీతో నగుదు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలు సందట్లో సడేమియాగా అభ్యర్థుల అవకాశాన్ని కొందరు మధ్యవర్తులు క్యాష్ చేసుకుంటున్నారు. ‘అన్నా.. నేను చెపితే ఇంత మంది ఓటు వేస్తారు. వాళ్లందరి ఓట్లు మీకే పడేలా చేస్తా. నన్ను కాస్త చూసుకో’ అంటూ బేరసారాలు సాగిస్తున్నారు. అలాంటి వారి ద్వారా నిజంగానే తాము లబ్ధిపొందుతామనే ఆశలో ఉన్న పలువురు నేతలు డబ్బులు ఇస్తున్నారు. నాయకులు మరో ఎత్తుగడను తెరముందుకు తెస్తున్నారు. తమకున్న రహస్య స్నేహితులతో మంతనాలు జరపటంలో నాయకగణం బిజీగా ఉంటోంది. ఇతర పార్టీల్లోని తమ కోవర్టుల ద్వారా తటస్తంగా ఉన్న ఓటర్లను గుర్తించి వారి ఓట్లకు వల వేసేందుకు అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. అధికారుల డేగకన్ను ఒకవైపు అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు పెడుతుంటే, వాటిని అరికట్టేందుకు ఎన్నికల అధికారులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వచ్చే ఏ సంఘటనైనా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. సొమ్ములకు, మందు, విందులు సహా ఇతరత్రా ఏ ప్రలోభాలకు లొంగవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన తమ ప్రత్యేక బృందాలు ప్రలోభాలు, ప్రచార తీరును గమనిస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే స్థానికంగా ఉన్న తమకు తెలియపర్చాలని ఎన్నికల అధికారులు కోరారు. కాగా మరోవైపు అధికారులు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. -
జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్ విషయంలో ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందని, తెలంగాణలో ఉంటూ సీమాంధ్ర నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నాడని అందుకే తలలేని మొండెం దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మతోన్మాదం, హైదరాబాద్‌లో ఐఎస్ఐ తీవ్రవాదం పెరిగి పాకిస్థాన్‌గా మారుతుందంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇకపై ఆయన తీరు మార్చుకోకుంటే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ తూర్పు జిల్లా సమన్వయకర్త బాబన్న, పట్టణ కన్వీనర్ జాఫర్‌హుస్సేన్, నాయకులు మునిరాజ్, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్ నైనాల వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ కె.జయరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పెరుషోత్తం, నాయకులు ఆరుముళ్ల పోశం, మల్లేశ్, రోహిత్త్రిపాఠి, బొద్దున మల్లేశ్, టీఆర్ఎస్ నాయకుడు తులా మధుసూధన్‌రావు పాల్గొన్నారు.