రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Thu, Apr 13 2017 10:08 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
మంచిర్యాల: రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొలవేని రమేశ్(35) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement