కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మణం చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మణం చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం నర్సాపూర్-రుస్తుంపేట రహదారిలోని బుట్టికుంట సమీపంలో చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎస్సై వెంకటరాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన ఎన్. శ్రీనివాస్(30) తన మిత్రుడు రమేష్‌తో కలిసి మూసాపేట నుంచి నర్సాపూర్ వైపు వస్తుండగా బుట్టికుంట సమీపంలో ఎదురుగా వస్తున్న ఇండికా కారు బలంగా ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.