ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మణం చెందాడు.
ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మణం చెందాడు. ఈ సంఘటన హుజూర్‌నగర్ ఇందిర సెంటర్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఎస్.రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై వెళుతుండగా..కోదాడ వైపు వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రమేష్ తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనక సీటులో కూర్చున్న చిన్నారి ఎలాంటి గాయాలు లేకుండా బతికి బయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.