మంచిర్యాల టౌన్ : తగ్గుముఖం పట్టిందనుకున్న స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. తాజాగా మరో మూడు స్వైన్‌ఫ్లూ కేసులు పాజిటివ్‌గా రావడంతో ఒక్కసారిగా జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అరుు్యంది. వారిలో ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా.. మరో ముగ్గురు తాజాగా వ్యాధి బారిన పడ్డారు. మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వంగపల్లి సాగర్‌రావు (53), ఏసీసీకి చెందిన కుక్క మేరి(27) ఈ నెల 9వ తేదీన స్వైన్ ఫ్లూ లక్షణాలతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఇద్దరికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో సాగర్‌రావు గత రాత్రి ఇంటికి వెళ్లగా హుటాహుటినా ఆస్పత్రికి పిలిపించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా.. మందమర్రి దీపక్‌నగర్‌కు చెందిన బెల్లారపు భారతి (35)కి కూడా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో మందమర్రి నుంచి ఆమె నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో ప్రస్తుతం మేరీ, సాగర్‌రావు చికిత్స పొందుతున్నట్లు వైద్యుడు నీలకంఠేశ్వర్‌రావు తెలిపారు.
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ..
Published Sun, Feb 15 2015 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement