జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం
Published Thu, Aug 29 2013 3:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్ విషయంలో ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందని, తెలంగాణలో ఉంటూ సీమాంధ్ర నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నాడని అందుకే తలలేని మొండెం దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మతోన్మాదం, హైదరాబాద్‌లో ఐఎస్‌ఐ తీవ్రవాదం పెరిగి పాకిస్థాన్‌గా మారుతుందంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇకపై ఆయన తీరు మార్చుకోకుంటే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ తూర్పు జిల్లా సమన్వయకర్త బాబన్న, పట్టణ కన్వీనర్ జాఫర్‌హుస్సేన్, నాయకులు మునిరాజ్, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్ నైనాల వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ కె.జయరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పెరుషోత్తం, నాయకులు ఆరుముళ్ల పోశం, మల్లేశ్, రోహిత్‌త్రిపాఠి, బొద్దున మల్లేశ్, టీఆర్‌ఎస్ నాయకుడు తులా మధుసూధన్‌రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement