'జగ్గారెడ్డి అరెస్టు అప్రజాస్వామికం'
హైదరాబాద్: మల్లన్నసాగర్ ముంపు రైతుల కోసం ఆమరణ దీక్ష చేపట్టడానికి బయలుదేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని, రీ డిజైన్‌ల పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు. దేశం మొత్తం 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తోంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల పొట్టకొట్టడానికి 123 జీవో తీసుకొచ్చిందని మండిపడ్డారు. 123 జీవో రద్దు చేసేవరకూ పోరాడతామని రాజనర్సింహ తెలిపారు.