
పెరంబూరు/చెన్నై: పద్మజ అనే సినీ, బుల్లితెర సహాయ నటి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక తిరువత్తియూర్‌లోని కలాడిపేటలో నివాసముంటున్న పద్మజ (23), పవన్‌రాజ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లాడు బంధువుల వద్ద పెరుగుతున్నాడు. ఇద్దరూ సెలవు దినాల్లో వెళ్లి బాబుతో గడిపి వస్తున్నారు. అయితే, గతకొంత కాలంగా పద్మజకు అవకాశాలు రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఆమె తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదే విషయమై శనివారం రాత్రి ఆమె తన సోదరితో చెప్పుకుని బాధ పడినట్టు సమాచారం.
రెండు రోజులుగా తలుపులు మూసి ఉండటం.. ఎటువంటి స్పందనా లేకపోవడంతో పద్మజ ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఆయన తిరువుత్తియూర్ పోలీసులకు ఆదివారం ఉదయం సమాచారం ఇచ్చారు. పోలీసులు డోర్ లాక్ బద్దలు కొట్టి చూడగా.. పద్మజ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం స్టాలిన్ అస్పత్రికి తరలించారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పవన్‌రాజ్‌ను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment