స్మార్ట్‌ దుష్ప్రభావం! | amavasya chandrudu youth full moive | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ దుష్ప్రభావం!

Published Wed, Dec 28 2016 12:01 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

స్మార్ట్‌ దుష్ప్రభావం! - Sakshi

స్మార్ట్‌ దుష్ప్రభావం!

కేతన, ప్రాచిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింగిల్‌ మ్యాన్‌ మూవీస్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో బి.ఎస్‌.ఆర్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘అమావాస్య చంద్రులు’. 73% యూత్‌ అన్నది ఉపశీర్షిక. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెర కెక్కుతోన్న చిత్రమిది. స్మార్ట్‌ ఫోన్, వైఫై, ఇంటర్నెట్‌ వల్ల నేటి యువతరం ఎలా చెడిపోతోంది? వాటి వల్ల కలిగే దుష్ప్రభావం ఏంటి? అని చూపించనున్నాం. కేవలం యూత్‌ మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులూ చూసే అంశాలు కూడా ఉంటాయి’’ అన్నారు. గుర్రపు విజయ్‌కుమార్, సంతోషిని, అస్మితా ఖాన్, కడప జ్యోతి, లావణ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ,మాటలు: బి.ఎస్‌.వాసు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గుర్రపు విజయ్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement