పఠాన్కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు | Afghan national arrested in Pathankot travelling without ticket, 2 mobile phones recovered | Sakshi
Sakshi News home page

పఠాన్కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు

Published Fri, Jan 29 2016 11:43 AM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

పఠాన్కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు - Sakshi

పఠాన్కోట్ రైల్లో ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు

పఠాన్కోట్: పఠాన్కోట్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ఆప్ఘనిస్తాన్ పౌరుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును ప్రారంభించారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై కొన్ని వారాల కిందట జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి పఠాన్ కోట్ పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి వెళ్లింది. అన్ని రకాల కదలికలను పోలీసులు పసిగడుతున్నారు. అదీ కాకుండా ఈ మంగళవారం పఠాన్ కోట్ రైల్వే స్టేషన్లో బాంబు ఉన్నట్లు అలికిడి వినిపించడంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్కడ ఏం లేదని గుర్తించారు. పోలీసులు, బలగాలు ఇదే అప్రమత్తతను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ అఫ్ఘనిస్తాన్ వ్యక్తి పట్టుబడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement