పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం | bomb tension at pathankot | Sakshi
Sakshi News home page

పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం

Published Tue, Jan 26 2016 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం

పఠాన్‌కోట్‌లో 'బాంబు' కలకలం

పటాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్‌లో మంగళవారం అనుమానాస్పద బ్యాగ్ లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పద బ్యాగును గుర్తించిన వెంటనే పట్టణంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, బ్యాంబ్ స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అనుమానాస్పద బ్యాగును తనిఖీ చేస్తోంది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాద హెచ్చరికలతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.  

పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు చనిపోగా.. ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో ఏ చిన్న ఘటన జరిగినా స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement