పఠాన్‌కోట్‌లో మళ్లీ టెన్షన్
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోకి చొరబడేందుకు కుట్రపన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తంకావడంతో ముప్పు తప్పింది. భారత జవాన్ల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పఠాన్‌కోట్‌లో భారత భద్రత దళాలు గస్తీ పెంచాయి. రోడ్లు, కీలక ప‍్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
జనవరిలో పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.