పఠాన్ కోట్లో హై అలర్ట్ | Pathankot on high alert: Suspicious looking men spotted, search operations underway | Sakshi
Sakshi News home page

పఠాన్ కోట్లో నలుగురు ఉగ్రవాదులు!

Published Tue, Sep 27 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

పఠాన్ కోట్లో హై అలర్ట్

పఠాన్ కోట్లో హై అలర్ట్

పంజాబ్ : పఠాన్కోట్లో ఆర్మీ అధికారులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం అందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  కాగా  పంజాబ్ సరిహద్దు వద్ద మంగళవారం ఆర్మీ దుస్తులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తున్నట్లు పోలీసులకు ఫోన్లో సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు వందలమంది భద్రతా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ముష్కరులు దాడి చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. నగర్ ఎస్ఎస్బీ క్యాంప్పై దాడి చేశారు. దీనికి ప్రతిగా భారత భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement