లండన్‌లో హై అలర్ట్‌.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్‌ కలకలం | High Alert In London City Parcel Found Near Us Embassy | Sakshi
Sakshi News home page

లండన్‌లో హై అలర్ట్‌.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్‌ కలకలం

Published Fri, Nov 22 2024 8:27 PM | Last Updated on Fri, Nov 22 2024 8:27 PM

High Alert In London City Parcel Found Near Us Embassy

లండన్‌:బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్‌ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం (నవంబర్‌22) నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది.

మరోవైపు గాట్విక్‌ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది.దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్‌ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement