పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జనవరి 2న జరిగిన ఉగ్ర దాడిని భారత్ ఇంకా మర్చిపోలేదు.
జమ్మూ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జనవరి 2న జరిగిన ఉగ్ర దాడిని భారత్ ఇంకా మర్చిపోలేదు. అలాంటి దాడి మరొకటి జరిగే అవకాశం ఉందనీ, కొంతమంది ఉగ్రవాదులు ఇంకా పఠాన్‌కోట్ పరిసర గ్రామాల్లోనే దాగి ఉన్నారని చెప్పి పార్లమెంటరీ స్థాయీ సంఘం బాంబు పేల్చింది.
సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ ఈ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదులు గ్రామాల్లో దాక్కున్న విషయం తమకు గ్రామస్థుల ద్వారా తెలిసిందనీ, పఠాన్‌కోట్‌పై మరోసారి దాడి జరిగే అవకాశం గురించి ప్రభుత్వానికి తెలియజేశామని కమిటీ.. ప్రభుత్వానికి తెలిపింది. దీంతో స్థావరం వద్ద భద్రత పెంచారు.