'ఎయిర్ బేస్లోకి పాక్ టీంకు అనుమతి'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు వస్తున్న పాకిస్థాన్ బృందానికి భారత్ స్వేచ్ఛను ఇచ్చింది. అవసరం అయిన ప్రతిచోట దర్యాప్తు చేసేందుకు వారికి అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు స్పష్టం చేశారు.
'పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా భారత్కు వస్తున్న పాకిస్థాన్ బృందం విషయంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు. మార్చి 27న వారు భారత్ వస్తున్నారని చెప్పారు. దాడి జరిగిన కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్లోకి అనుమతిస్తారా అని ప్రశ్నించగా ఎక్కడ అవసరం అయితే అక్కడకు అనుమతిస్తామని చెప్పారు.