joint investigation team
-
రూ.కోట్లల్లో ప్రధాని కూమార్తె ఆస్తులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మార్యాం నవాజ్‌పై పనామా కుంభకోణం సంయుక్త విచారణ కమిటీ (జేఐటీ) సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమకు నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తున్నారని, ఇది ముమ్మాటికీ క్రిమినల్ నేరం అవుతందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా గేట్ కుంభకోణంలో షరీఫ్ కుటుంబానికి పెద్ద మొత్తంలో చోటుందని, దానికి సంబంధించిన విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్‌లోని జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. అయితే, షరీఫ్ కూతురు మార్యాం నవాజ్, ఆమె సోదరులు హుస్సేన్, హసన్ నవాజ్, అలాగే ఆమె భర్త కెప్టెన్ మహ్మద్ సఫ్దార్ కూడా తప్పుడు ధ్రువపత్రాలపై సంతకాలు పెట్టి వాటినే సమర్పిస్తూ సుప్రీంకోర్టును పక్కదారి పట్టిస్తున్నారంటూ జేఐటీ ఆరోపించింది. 'మార్యామ్ నవాజ్‌కు 2009 నుంచి 2016 మధ్య కాలంలో రూ.73.5మిలియన్ల నుంచి రూ.830.73 మిలియన్ల వరకు ముట్టాయి' అని కూడా జేఐటీ తెలిపింది. ఎలాంటి ఆదాయం లెక్కలు చూపించకుండానే 1990 నుంచి ఈ మధ్య కాలంలో అనూహ్యంగా ఆమె ఆస్తులు వందల రెట్లు పెరిగాయని కూడా పేర్కొంది. అయితే, దీనిపై షరీఫ్ కూతురు స్పందించారు. అసలు విషయం సుప్రీంకోర్టులో తేలుతుందని, అంతకుముందు వచ్చే ఏ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
ప్రధానికి షాక్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. తన కుటుంబ ఆస్తులకు సంబంధించి పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని అధినేతను జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) ఆదేశించింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ జ్యుడీషియల్ అకాడమీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జేఐటీ ఈనెల 8న సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకూ ఏ పాక్ ప్రధాని న్యాయ విచారణ ఎదుర్కొనలేదు. దీంతో విచారణ కమిటీ ముందు హాజరయ్యే మొదటి ప్రధాని నవాజే అవుతారని పాక్ వార్తా సంస్థ డాన్ న్యూస్ తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌ను కూడా కమిటీ ప్రశ్నించే అవకాశం ఉందని డాన్ న్యూస్ తెలిపింది. జూన్ 2న షరీఫ్ రెండో కుమారుడు ఆరుగురు సభ్యుల విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన పెద్ద కుమారుడు హుస్సేన్ నవాజ్ కూడా విచారణ కమిటీ ముందు మూడోసారి హాజరయ్యారు. -
'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు మిషతో పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను భారత్ లోకి అనుమతించడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరాన్ని తీవ్రతరం చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఇది సిగ్గుచేటు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారు. ఇంతకు ముందున్న ప్రధానులెవ్వరూ ఇలా చెయ్యలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తున్నారు. కానీ వాళ్లే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బటికి రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలు మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు. -
'ఎయిర్ బేస్‌లోకి పాక్ టీంకు అనుమతి'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు వస్తున్న పాకిస్థాన్ బృందానికి భారత్ స్వేచ్ఛను ఇచ్చింది. అవసరం అయిన ప్రతిచోట దర్యాప్తు చేసేందుకు వారికి అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు స్పష్టం చేశారు. 'పఠాన్ కోట్ దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా భారత్‌కు వస్తున్న పాకిస్థాన్ బృందం విషయంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు. మార్చి 27న వారు భారత్ వస్తున్నారని చెప్పారు. దాడి జరిగిన కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లోకి అనుమతిస్తారా అని ప్రశ్నించగా ఎక్కడ అవసరం అయితే అక్కడకు అనుమతిస్తామని చెప్పారు. -
పఠాన్‌కోట్ ఘటనపై విచారణకు పాక్ జేఐటీ
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాది దాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని (జేఐటీ)ని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం వచ్చే నెలలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనుంది. ఈ దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారం తర్వాత పాక్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పాక్ బృందం భారత ప్రభుత్వ అనుమతి తీసుకుని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సాక్ష్యాలను సేకరించి సొంతంగా దర్యాప్తు చేయనుంది. విచారణ బృందంలో పంజాబ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) ఎడిషనల్ ఐజీ మహ్మద్ తాహీర్ రాయ్‌ను కన్వీనర్‌గా నియమించింది. లాహోర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఇంటెలిజన్స్ బ్యూరో మహ్మద్ అజిమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్(ఐఎస్ఐ) లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజన్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మీర్జా, గుజ్జరన్వాలా సీటీడీ ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ షాహిద్ తన్వీర్ సభ్యులుగా ఉంటారు. ఈ ఘటనపై భారత్ ఇచ్చిన ఆధారాల మేరకు ప్రాథమిక దర్యాప్తు చేయడానికి ఇంతకుముందు ఆరుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం(సిట్)ను పాక్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ నుంచి జేఐటీకి బదిలీ చేస్తున్నటు పాకిస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగం నుంచే భారత్‌కు వచ్చినట్లు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందచేశారు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరి18న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాక్.. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరును నమోదు చేయలేదు. -
'మేం పని పూర్తయ్యాకే స్పందిస్తాం'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తుపై ఇప్పుడే స్పందించబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అలా చేయడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొంది. పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరంపై ఈ నెల(జనవరి) 2న పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసు అధికారులు పలువురు ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఈ దర్యాప్తునకు సంబంధించి గత రెండు రోజులుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు మీడియా ప్రతినిధులు దర్యాప్తుపై ప్రశ్నించగా పాకిస్థాన్ న్యాయశాఖమంత్రి రాణా సనావుల్లా స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు తాము ఏ విధంగాను స్పందించబోమని ఆయన స్పష్టం చేశారు. విచారణ బృందం వారిపని వారు చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందికలిగించకుండా ఉండాలంటే ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.