టార్గెట్ కోల్ కతా..! | Two Naval ships called back for operational reasons | Sakshi
Sakshi News home page

టార్గెట్ కోల్ కతా..!

Published Wed, Nov 5 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

టార్గెట్ కోల్ కతా..!

టార్గెట్ కోల్ కతా..!

కోల్‌కతా/న్యూఢిల్లీ: కోల్‌కతాలో, ముఖ్యంగా అక్కడి నౌకాశ్రయ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు యుద్ధ నౌకలను నౌకాదళం అక్కడినుంచి ఉపసంహరించుకుంది. నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్థం ఐఎన్‌ఎస్ సుమిత్ర, ఐఎన్‌ఎస్ ఖుక్రీలను కోల్‌కతా రేవులో నిలిపి ఉంచాలని నౌకాదళం భావించినప్పటికీ.. తాజా హెచ్చరికల నేపథ్యంలో వాటిని మంగళవారమే అక్కడినుంచి తరలించింది. ముందు జాగ్రత్త చర్యగా వాటిని తరలించినట్లు ఢిల్లీలోని అధికార వర్గాలు తెలిపాయి. కానీ యుద్ధ నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద దాడుల హెచ్చరిక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు.

 

అత్యంత తక్కువ సమయమిచ్చినప్పటికీ.. విధుల్లో చేరే విషయంలో మన యుద్ధ నౌకల సన్నద్ధతను పరీక్షించడం కోసమే ఆ యుద్ధ నౌకల తరలింపు ప్రక్రియ చేపట్టామని మంగళవారం కోల్‌కతాలో రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, నిఘా సంస్థల నుంచి ఉగ్రవాదుల దాడుల గురించి హెచ్చరికలు వచ్చాయని, అందువల్ల భద్రతను కట్టుదిట్టం చేశామని కోల్‌కతా పోలీస్ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement