Navy warships
-
నేడు నేవీ డే
సాక్షి, విశాఖపట్నం: భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో జరుగుతుంది. ఈ ఏడాది మిచాంగ్ తుపాను కారణంగా 4న∙జరగాల్సిన వేడుకల ను 10కి వాయిదా వేశారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలను ప్రదర్శిస్తారు. సుమారు 2 వేలమంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ముఖ్య అతిథిగా గవర్నర్ నజీర్ నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 1 గంటకు పోర్టు గెస్ట్‌హౌస్‌కు వస్తారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, అనంతరం తూర్పు నౌకాదళ (ఈఎన్సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందుకు హాజరవుతారు. తిరిగి రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. -
టార్గెట్ కోల్ కతా..!
కోల్‌కతా/న్యూఢిల్లీ: కోల్‌కతాలో, ముఖ్యంగా అక్కడి నౌకాశ్రయ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు యుద్ధ నౌకలను నౌకాదళం అక్కడినుంచి ఉపసంహరించుకుంది. నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్థం ఐఎన్ఎస్ సుమిత్ర, ఐఎన్ఎస్ ఖుక్రీలను కోల్‌కతా రేవులో నిలిపి ఉంచాలని నౌకాదళం భావించినప్పటికీ.. తాజా హెచ్చరికల నేపథ్యంలో వాటిని మంగళవారమే అక్కడినుంచి తరలించింది. ముందు జాగ్రత్త చర్యగా వాటిని తరలించినట్లు ఢిల్లీలోని అధికార వర్గాలు తెలిపాయి. కానీ యుద్ధ నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద దాడుల హెచ్చరిక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు. అత్యంత తక్కువ సమయమిచ్చినప్పటికీ.. విధుల్లో చేరే విషయంలో మన యుద్ధ నౌకల సన్నద్ధతను పరీక్షించడం కోసమే ఆ యుద్ధ నౌకల తరలింపు ప్రక్రియ చేపట్టామని మంగళవారం కోల్‌కతాలో రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, నిఘా సంస్థల నుంచి ఉగ్రవాదుల దాడుల గురించి హెచ్చరికలు వచ్చాయని, అందువల్ల భద్రతను కట్టుదిట్టం చేశామని కోల్‌కతా పోలీస్ అధికారులు తెలిపారు.