సాక్షి, విశాఖపట్నం: భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో జరుగుతుంది. ఈ ఏడాది మిచాంగ్ తుపాను కారణంగా 4న∙జరగాల్సిన వేడుకల ను 10కి వాయిదా వేశారు.
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలను ప్రదర్శిస్తారు. సుమారు 2 వేలమంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ముఖ్య అతిథిగా గవర్నర్ నజీర్
నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 1 గంటకు పోర్టు గెస్ట్‌హౌస్‌కు వస్తారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, అనంతరం తూర్పు నౌకాదళ (ఈఎన్‌సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందుకు హాజరవుతారు. తిరిగి రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment