Abdul Nazir
-
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు. ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా? సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జర్నలిస్టులనూ వదలరా? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
‘రెడ్‌బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలన: వైఎస్ జగన్
రాష్ట్రంలో నెలన్నర రోజులుగా డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వ అండదండలతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూరా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఊళ్లొదిలాయి. వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు రక్షణ లేకుండా పోయింది. కళ్లెదుటే ఫొటో, వీడియో ఆధారాలున్నా పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిలువరించే సాహసం చేయలేకపోతోంది.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం అరాచకాలు, ఆటవిక పాలన, హింసాకాండపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను కోరారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం నిస్తేజంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదు. రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది’ అని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. దాదాపు 45 నిముషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అండదండలతో సాగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ గురించి గవర్నర్‌కు వివరించారు. ‘వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేకుండాపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రాష్ట్రంలో 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలకు పాల్పడగా, వేధింపులు తట్టుకోలేక 35 మంది అత్మహత్యలు చేసుకున్నారు. 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులతో భయకంపితులై 2,700 కుటుంబాలు తమ గ్రామాలను విడిచి పోయాయి. వాటితోపాటు 1,050 దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి’ అని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ గూండాలు పాల్పడిన హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సహా పూర్తి ఆధారాలను గవర్నర్‌కు సమరి్పంచారు. గవర్నర్‌కు సమరి్పంచిన వినతిపత్రంలో విషయాలు ఇలా ఉన్నాయి. అదఃపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాజ్యాంగ వ్యవస్థలు విఫలమయ్యాయి. అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. సామాన్యుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దారుణంగా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీలకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారిని అవమానిస్తూ.. దాడులకు పాల్పడుతుండటమే కాకుండా హతమారుస్తున్నారు. వారి ఆస్తులు, వ్యాపారాలను ధ్వంసం చేస్తూ, ఇళ్లను నేలమట్టం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ భవనాలతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వాటిని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ఒకే ఒక్క విద్వేషంతోనే ఇలా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. ఎంపీల నుంచి సామాన్యుల వరకూ రక్షణ కరువు టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులకు పరాకాష్టగా వినుకొండలో వైఎస్సార్సీపీ క్రియాశీల కార్యకర్త రషీద్‌ను ఈ నెల 17న కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు సమీపంలోనే ఉన్నాసరే నడి వీధిలో దాడి చేసి మరీ పాశవికంగా హత్య చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నెల 18న చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీ ఎన్.రెడ్డప్పను కలిసేందుకు వెళ్లిన లోక్‌సభ వైఎస్సార్సీపీ పక్ష నేత, ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాయి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడికి పాల్పడటం రాష్ట్రంలో సామాన్యులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల ఉదాసీనతకు ఈ దాడి అద్దం పడుతోంది. పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరితో అమానవీయంగా దాడులు చేసేందుకు తమకు అనుమతి లభించిందన్న రీతిలో టీడీపీ గూండాలు చెలరేగిపోయి యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. రెడ్ బుక్.. రాజ్యాంగ అరాచకం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు. రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం అచేతనంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోంది. రాజకీయ గుండాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. గత ఐదేళ్లపాటు రాష్ట్రం అత్యుత్తమ విద్య, వైద్య–ఆరోగ్య విధానాలు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, పటిష్టమైన శాంతి–భద్రతలు, సమీకృత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. కానీ ప్రస్తుతం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపులు, విధ్వంసానికి మారుపేరుగా దిగజారిపోయింది. రాష్ట్రంలో అంతటా అరాచకమే రాజ్యమేలుతోంది. ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి.వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర వైఎస్సార్సీపీని అణచి వేయాలని, తమ పార్టీతో అనుబంధం ఉన్న వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఏకైక కుట్రతోనే ఈ దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. అందుకోసం అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో అధికారుల వరకు ఈ మేరకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఓ రాష్ట్ర మంత్రి రెడ్‌బుక్ పేరుతో ఏకంగా హోర్డింగులు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయమని తమ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. ఈ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దాంతోనే టీడీపీ గుండాలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని హత్యలు, దాడులు, దురాగతాలకు పాల్పడేందుకు దురి్వనియోగం చేస్తున్నారు. 27 మంది ఐఏఎస్ అధికారులు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వివక్ష, కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో శాంతి–భద్రతలు అదఃపాతాళానికి దిగజారిపోయాయి. రాష్ట్రంగానీ ప్రజలుగానీ ఈ దుస్థితిని ఇక ఏమాత్రం భరించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాకాండపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతున్నాం. -
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలను అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరింది. వైఎస్సార్సీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఈమేరకు వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, అస్థిరత నెలకొందని వివరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపింది. తక్షణమే జోక్యం చేసుకొని టీడీపీ అరాచకాలకు అడ్డకట్ట వేయాలని గవర్నర్‌ను వైఎస్సార్సీపీ బృందం కోరింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన, ఇళ్లపైన దాడులు చేస్తున్నారని, దారుణంగా అవమానిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తున్నారని, పారీ్టకి చెందిన, వైఎస్సార్ పేరు ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా తగలబెడుతున్నారని అన్నారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. హింసాత్మక ధోరణి కొనసాగరాదు : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండాలని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2014 –19లో చంద్రబాబు తెచ్చిన జీవో, నిబంధనల ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని తెలిపారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. అయినా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దు్రష్పచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉందన్నారు. అంటే ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇలా ఇప్పటి వరకు 18 ఆఫీసులకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు ప్రజాధనం దురి్వనియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్,, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు స్థలాలు మంజూరు చేసిన విధంగానే, ఆ నిబంధనల ప్రకారమే వైఎస్సార్సీపీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడున్న తమ కార్యకర్తలు, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. వీటికి సంబంధించి ఫొటోలను కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి ‘ఇంత దారుణంగా పరిస్థితి ఉందా’ అని గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు. -
యథేచ్ఛగా టీడీపీ, జనసేన నాయకుల హింసాకాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారం చేపట్టక ముందే టీడీపీ, జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్సార్ సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విన్నవించారు. ఈమేరకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి గవర్నర్‌కు గురువారం వినతిపత్రం అందచేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అనంతరం బిహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు చెప్పారు. టీడీపీ మూకలు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడి పలు చోట్ల గృహ దహనాలు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు. మహిళలు, పిల్లలను సైతం హింసించి భయ భ్రాంతులకు గురి చేశాయని తెలిపారు. టీడీపీ, జనసేన విధ్వంస కాండకు సంబంధించి వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలించి విస్తుపోయిన గవర్నర్.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కళ్ల ముందే దాడి జరిగినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు వెల్లడించారు. నూజివీడులో కౌన్సిలర్‌పై పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడి జరగటాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. ఈ ఘటనలపై డీజీపీతో చర్చించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. పర్యవసానాలు తప్పవు వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్న వారిపై దాడులు చేసేందుకే అధికారంలోకి వచ్చారా? అని టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. ఎర్ర పుస్తకం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులను ఆపకుంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు కమిటీలు, లీగల్ టీమ్స్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు 26 జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కమిటీలను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినట్లు పేర్ని నాని వెల్లడించారు. బాధితులను పరామర్శించడంతో పాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ హింసాకాండను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. 26 జిల్లాలో ఏర్పాటైన లీగల్ టీమ్‌లు బాధితులకు అండగా నిలుస్తాయని, శుక్రవారం నుంచి చురుగ్గా పని చేస్తాయని తెలిపారు. కింది స్థాయి పోలీసులు కేసులు నమోదు చేయకుంటే ఎస్పీలను కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. -
విద్య.. ప్రపంచాన్ని మార్చే ఆయుధం
గుడ్లవల్లేరు (గుడివాడ): ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యే అని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ(ఎస్జీఈసీ) రజతోత్సవాల ముగింపు సభకు ఆయన ఆదివారం హాజరయ్యారు. అబ్దుల్ కలాం చెప్పిన ప్రపంచ పురోగతి సాధించాలంటే అది విద్య అనే శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దానికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యం, దూర దృష్టి, అభిరుచి, ఆలోచనా దృక్పథాలతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడం హర్షదాయకమన్నారు. తొలుత కాలేజీ స్థాపనతో పాటు అభివృద్ధి చేసిన వ్యవస్థాపకుడు వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావుకు కృతజ్ఞతాంజలి తెలిపిన పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అందజేశారు. గవర్నర్‌ను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ సన్మానించారు. కలెక్టర్ పి.రాజాబాబు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య రంగంలో విప్లవాత్మక ఫలితాలు
లబ్బీపేట (విజయవాడతూర్పు): వైద్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాలతో సత్ఫలితాలొస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. వైద్య సేవలనే కాకుండా, వైద్య విద్యను సైతం అందరికీ చేరువ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హాలులో జరిగిన వేడుకల్లో యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యఅతిథిగా బెంగళూరుకు చెందిన నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 60 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు అందలం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించిందన్నారు. ఆ పథకంలో చికిత్సల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు, 3,257 వైద్య ప్రక్రియలతో సహా, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలల్లో కోర్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆస్పత్రులు, 12 జిల్లా ఆస్పత్రులు, 11 టీచింగ్ ఆస్పత్రులు, 15 స్పెషాలిటీ ఆస్పత్రులు, 542 యూపీహెచ్‌సీలు రోగుల ఆరోగ్యానికి భద్రత ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథి నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైద్యులు నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్ (ఎగ్జామినేషన్స్) పి.ప్రవీణ్‌కుమార్, యూనివర్సిటీ సభ్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్, పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి మేళవింపు.. 'ప్రగతికి ప్రణామం'
సాక్షి, అమరావతి: సంక్షేమాన్ని–అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరులనే చుక్కానిగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. నవరత్నాల పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. నీతిఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015–16లో 11.77% ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. గత నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.4.23 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం వినూత్న విధానాలకు అంకురార్పణ చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతోపాటు సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిబద్ధతను గవర్నర్ అభినందించారు. ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. తన ప్రసంగంలో గవర్నర్ ఏమన్నారంటే.. విద్యా సంస్కరణలు.. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. విద్యా రంగ సంస్కరణల కోసం ఇప్పటివరకు రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. ‘జగనన్న అమ్మ ఒడి’ ద్వారా రూ.26,067 కోట్లు వెచ్చించింది. ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు పథకంతో లబ్ధి పొందుతున్నారు. 56,703 ప్రభుత్వ విద్యా సంస్థలను మూడు దశల్లో ఆధునీకరించేంందుకు ‘మన బడి – నాడు నేడు’ చేపట్టింది. ఇప్పటివరకు రూ.7,163 కోట్లు వెచ్చించింది. 44,800 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను నియమించింది. విద్యార్థుల్లో పోషకాహార సమస్యను నివారించేందుకు 16 రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా ‘జగనన్న గోరుముద్ద’ చేపట్టింది. 43.27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏటా రూ.1,910 కోట్లు చొప్పున రూ.4,417 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా ఏటా 47 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.3,367 కోట్లు ఖర్చు చేసింది. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు 62 వేల ఇంటరాక్టివ్ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్‌ను 2026 నుంచి ప్రవేశపెడుతోంది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి పీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ.11,901 కోట్లను చెల్లించింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం రూ.4,276 కోట్లను పంపిణీ చేసింది.పేద విద్యార్థుల కలను నిజం చేస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. అత్యున్నత 50 విదేశీ విద్యా సంస్థల్లో 21 ఫ్యాకల్టీలలో విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తూ రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లిస్తోంది. పథకం కింద ఇప్పటివరకు రూ.107.08 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. వర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గిపోయాయి. వైద్య విప్లవం వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వైద్య విద్య విధానాన్ని ప్రభుత్వం సంస్కరించింది. 11 వైద్య కళాశాలలను బలోపేతం చేయడంతోపాటు 17 కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను ఇటీవలే ప్రారంభించాం. వైద్య, ఆరోగ్య రంగంలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 3.03 కోట్ల ఓపీ సేవలను అందించాం. 104, 108 అంబులెన్స్ సేవల కోసం రూ.1,208 కోట్లు వెచ్చించి 1,704 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇటీవలే రూ.25 లక్షలకు పెంచాం. 2,315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స లాంటి ఖరీదైన ప్రొసీజర్లు, క్యాన్సర్ చికిత్సతో సహా 3,257 ప్రొసీజర్లకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. 2019 నుంచి ఇప్పటివరకు 36 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. అందుకోసం ప్రభుత్వం రూ.12,150 కోట్లు వెచ్చించింది. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు గరిష్ట పరిమితితో రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. సాగు.. బాగు సొంత భూములు సాగు చేసుకునే రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోన్మెంట్ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.53.53 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్లు పంపిణీ చేసింది. వన్‌స్టాప్ సెంటర్లుగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పింది. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 54.75 లక్షల మంది రైతుల క్లైమ్లను పరిష్కరించి రూ.7,802.05 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,835 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 22.85 లక్షల మంది వ్యవసాయ, ఉద్యాన రైతలకు రూ.1,977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసింది. దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల వద్దే ధాన్యాన్ని సేకరిస్తూ గోనె సంచుల వినియోగ చార్జీలు, రవాణా ఖర్చులను కూడా రైతులకు చెల్లిస్తోంది. రూ.63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎంఎస్పీ పరిధిలోకి రాని పంటలకు కూడా గిట్టుబాటు ధర అందించేందుకు ఇప్పటివరకు రూ.7,751 కోట్లు వెచ్చించింది. మిచాంగ్ తుపాను సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు రూ.347.55 కోట్లను వెచ్చించింది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ నాలుగేళ్లలో 5,83,240 ఎకరాలను ఉద్యాన పంటల సాగులోకి తెచ్చింది. అరటి, పసుపు, ఉల్లి, మిర్చి లాంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం కంటే అధికంగా కనీస మద్దతు ధర అందిస్తోంది. సూక్ష్మ సేద్యం కింద 12.74 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 35.85 లక్షల ఎకరాల విస్తీర్ణానికి వర్తింపజేసింది. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోకి ఆక్వా కల్చర్‌ను తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 2,43,394 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తూ రూ.540 కోట్లు పంపిణీ చేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 20,034 ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128.27 కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కి పెంచింది. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,186.36 కోట్లను వెచ్చించి 61,682 మందికి ప్రయోజనం కలిగించింది. రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్‌లను నెలకొల్పింది. మహిళా సాధికారికతకు పెద్దపీట రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తూ 64 లక్షల మంది గర్భిణులు, బాలింతలతోపాటు 28.62 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,688 కోట్లు వెచ్చించడంతో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌష్టికాహార లోపాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు రూ.21.82 కోట్లు వెచ్చించి గ్రోత్ మానిటరింగ్ పరికరాలను కొనుగోలు చేసింది. రూ.71 కోట్లు వెచ్చించి 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సమకూర్చడంతో 3,27,289 మంది ప్రయోజనం పొందారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలు బకాయి పడిన రూ.25,571 కోట్లను నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించింది. దాంతో 7,98,395 స్వయం సహాయక సంఘాల్లోని 78.84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటివరకు 9,76,119 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతల్లో రూ.4,969.05 పంపిణీ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందచేస్తోంది. పథకం ద్వారా 26.39 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ చేసింది. నాలుగో విడత ఈ నెలలోనే పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మంది మహిళలకు రూ.2,029 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4,39,068 మంది మహిళలకు రూ.1,257.04 కోట్లు అందించింది. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తూ దిశ యాప్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 1.46 కోట్ల మంది యాప్ డౌన్లోడ్ చేసుకోగా 3,040 కేసులను నమోదు చేశారు. ‘సామాజిక’ నవశకం పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 17,005 లే అవుట్లలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళలకు పంపిణీ చేశారు. 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. వైఎస్సార్ పింఛన్ కానుక కింద 66.34 లక్షల మందికి ప్రతి నెలా టంచన్‌గా పింఛన్లు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచడంతో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.1,961 కోట్లకు పెరిగింది. వార్షిక బడ్జెట్ దాదాపు రూ.23,476 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు రూ.86,692 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున 2,78,961 మందికి రూ.1,305 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు చొప్పున 81,783 మంది లబ్ధిదారులకు రూ.983 కోట్లు అందచేసింది. వైఎస్సార్ లా నేస్తం కింద కింద జూనియర్ న్యాయవాదులకు ఆర్నెళ్లకు రూ.30 వేలు చొప్పున మూడేళ్ల కాలానికి స్టైఫండ్ అందిస్తోంది. ఇప్పటివరకు 2,564 మందికి రూ.11.83 కోట్లు అందించింది. జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు పంపిణీ చేసింది. 19.52 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.521.73 కోట్లు వెచ్చించింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఏడాదికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇప్పటివరకు 15.87 లక్షల మందికి రూ.88.33 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేసింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.1,582 కోట్లు అందచేసింది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటివరకు 46,329మందికి రూ.350.89 కోట్లు అందించింది. ఉపాథి హామీ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలోఉంది. సగటున 25 కోట్ల పనిదినాలు సృష్టించడంలో దేశంలో టాప్ 3 స్థానాల్లో నిలిచింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2 వేల ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేస్తోంది. మచిలీపట్నం, మార్కాపురం, ప్రొద్దుటూరు, కమలాపురం, నరసాపురం, అమలాపురంలో ఈ ఏడాది రూ.327.38 కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. జగనన్న టౌన్ షిప్‌ల కింద 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్టులను చేపట్టింది. రహదారులు.. కొత్త బస్సులు రాష్ట్రంలో ఇప్పటివరకు 53,481 కి.మీ. మేర రహదారుల పనులను చేపట్టింది. 2023–24లో 268 కి.మీ. మేర 58 బీటీ రోడ్లు వేసింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన కింద రూ.261 కోట్లు ఖర్చు చేసింది. గుంతలులేని రహదారులే లక్ష్యంగా రూ.490.80 కోట్లతో 1,221 కి.మీ. మేర పనులు మంజూరు చేసింది. రూ.1,121.85 కోట్ల తో 4,635 కి.మీ. మేర 1,877 బీటీ రోడ్లను పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత పాత బస్సుల స్థానంలో 880 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. సాగునీటికి ప్రాధాన్యం జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆర్ అండ్ ఆర్ పనులకు వేగవంతం చేసింది. సంగం ప్రాజెక్ట్, బ్యారేజీలను పూర్తి చేసి పెన్నార్ డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కనుపూరు కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం పరిష్కరించింది. చిత్రావతి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను రూ.280 కోట్లతో పూర్తి చేసి 10 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం రూ.925 కోట్లు ఖర్చు చేసి 27 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. అవుకు రెండో టన్నెల్ పూర్తి చేయడం ద్వారా ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో పనులను పూర్తి చేయడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ పంప్ ప్రాజెక్ట్ నుంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చిన్నతరహా సాగునీటి చెరువులను నీటితో నింపింది. వెలిగొండ మొదటి టన్నెల్ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో టన్నెల్ కూడా కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యిందని త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. 2024 సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్ నీటిని నిల్వ చేసేందుకు వీలవుతుంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచి కెనాల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతలలో పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీల నీటి నిల్వ చేసింది. జల్ జీవన్ మిషన్ కింద రూ.15,61.30 కోట్లతో 60.55 లక్షల కుటుంబాలకు ఎఫ్టీసీలతో తాగునీటిని అందించింది. శ్రీకాకుళం, వైఎస్సార్, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో రూ.10, 137 కోట్లతో 9 తాగునీటి ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. పారిశ్రామిక పురోభివృద్ధి విశాఖ జీఐఎస్ సదస్సులో కుదుర్చుకున్న 386 ఒప్పందాల ద్వారా 6,07,388 మందికి ఉపాధి కల్పించే రూ.13.11 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. గత 56 నెలల్లో 1.30 లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 311కుపైగా భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లుగా రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను అభివృద్ధి చేసింది. హబ్ ద్వారా 75 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులను పెంపొందిస్తోంది. వీసీఐసీ కారిడార్‌లో రూ.లక్ష కోట్లు అదనపు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి ద్వారా లక్ష మందికిపైగా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించనుంది. రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 110 మిలియన్ టన్నులకు పెంచి 75 వేలమందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. వరల్డ్ లాజిస్టిక్స్ – సప్లయ్ చైన్ కాంగ్రెస్.. ఏపీ మారిటైమ్ బోర్డ్‌ను ‘మారిటైమ్ బోర్డ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 నెలల్లో అందుబాటులోకి రానుంది. గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలను విస్తరిస్తోంది. విశాఖప మధురవాడలో రూ.14,634 కోట్లతో 200 ఎండబ్లూ డేటా సెంటర్, కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో 100 ఎండబ్లూ డేటా సెంటర్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 7,290 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.3,685 కోట్ల పెట్టుబడితో 17 పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కోవిడ్ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది. 2023–24లో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ఉండవచ్చని నివేదికలు సూచించాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2022–23లో రూ.2,19,518 ఉండగా 2023–24లో రూ.2,42,479కు పెరిగి 1043 శాతం వృద్ధి రేటు సాధించింది. గడప వద్దకే సుపరిపాలన పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. 2.6 లక్షల మంది వలంటీర్ల నియామకం ద్వారా గడప వద్దకే పరిపాలను తెచ్చాం. 540 రకాల సేవలకు సంబంధించి 9.84 కోట్ల అర్జీలను సకాలంలో పరిష్కరించాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలకు తగ్గకుండా పనులు మంజూరు చేశాం. భూవివాదాల పరిష్కారం భూవివాదాల పరిష్కారానికి వందేళ్ల తరువాత వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా రెండు దశల్లో 4 వేల గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వేను పూర్తి చేశాం. 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత పట్టాలు, 4.8 లక్షల మార్పిడి సమస్యలకు పరిష్కారం, 10.21 లక్షల కొత్త సబ్ డివిజన్లకు అవకాశం కల్పించాం. 20,24,709 మంది భూమిలేని పేదలకు 35,44,866 ఎకరాలను పంపిణీ చేశాం. -
AP: నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
సందడిగా రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన
మా ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ 99.5 శాతం హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనను పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు.. మార్గదర్శక విధానమని నిరూపించింది. – గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ ప్రగతి దిశగా పయణిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గత 56 నెలలుగా లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలను ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తోందన్నారు. అణగారిన వర్గాల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను చేరవేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌర సేవలను చేర్చి గ్రామ స్వరాజ్య భావనకు జీవం పోశామన్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా రూ.2,52,943.48 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా మరో రూ.1,68,151.08 కోట్లు కలిపి మొత్తం రూ.4,21,094.56 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు సామాజిక విప్లవాన్ని తెస్తూ నామినేటెడ్ పనులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో చరిత్రాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. పుష్కలమైన వనరులు, అపార అవకాశాలతో ఏపీ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నిరుద్యోగం రేటు వేగంగా తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్వరాజ్యం సాకారం.. రాష్ట్రంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గొప్ప పాలన సంస్కరణలు తెచ్చాం. 540కిపైగా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దే అందుతున్నాయి. సొంత ఊరిలోనే యువతకు 1.35 లక్షలకుపైగా శాశ్వత ఉద్యోగాలు, 2.66 లక్షల మందికి వలంటీర్లుగా పని చేసే అవకాశం దక్కింది. 9,260 ఎండీయూలతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరుగుతుండగా వలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నాం. రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తూ ఏపీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ప్రతి నెలా 66.34 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,968 కోట్లు అందిస్తోంది. గత 56 నెలల్లో సామాజిక భద్రతా పింఛన్ల కోసమే రూ. 84,731 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న సురక్ష ద్వారా కోటి సర్టిఫికెట్లను పౌరులకు ఉచితంగా అందచేసింది. ప్రపంచ స్థాయి విద్య.. మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. జగనన్న అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున 44 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు అందించాం. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నాడు–నేడు ద్వారా రూ.17,805 కోట్లతో 56,703 ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక కిట్లను ఉచితంగా అందిస్తున్నాం. దీని కోసం ఇప్పటి వరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు రోజుకో మెనూతో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.4,417 కోట్లు వ్యయం చేసింది. జగనన్న విద్యాదీవెన కింద 26,98,728 మంది లబ్దిదారులకు రూ.11,901 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించగా వసతి దీవెన కింద 25,17,245 మంది లబ్ధిదారులకు రూ.4,276 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు రూ.107.08 కోట్లు వెచ్చించింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీకి రూ.1,306 కోట్లు ఖర్చు చేసింది. 62 వేలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45 వేల స్మార్ట్ టీవీలను సమకూర్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు టోఫెల్‌కు సన్నద్ధం చేస్తూ శిక్షణ అందిస్తోంది. ఉన్నత విద్యలో సమున్నతం.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ విద్యా వేదిక ఎడెక్స్‌తో ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల్లో లభించే 2 వేల వర్టికల్స్‌ను మన విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు జాబ్ ఓరియెంటెడ్ మాడ్యూల్స్, 30 శాతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కరిక్యులమ్‌లో ప్రవేశపెట్టింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఒకే ఏడాది ఇంటర్న్‌షిప్‌లలో 3 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 18 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రజారోగ్యానికి పెద్ద పీట.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు క్యాన్సర్ లాంటి క్లిష్టమైన వ్యాధులకు పరిమితి లేని వైద్యాన్ని అందిస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను 1,059 నుంచి 3,257కి పెంచింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద రూ.12,150 కోట్లు ఖర్చు చేయగా 4.25 కోట్ల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.1,366 కోట్లు్ల అందించింది. వైద్య రంగంలో ఖాళీలు లేకుండా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించింది. రూ.1,208 కోట్లతో 1,704 వాహనాలు (108, 014లు), రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, డబ్ల్యూహెచ్ఓ/జీఎంపీ ప్రమాణాలతో 562 ఔషధాలను ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉంచింది. నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చింది. 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 5 నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించింది. రూ.700 కోట్లతో ‘వైఎస్సార్ సుజలధార’ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలను తీర్చింది. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు, తిరుపతి (చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్), కడప (మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.96 కోట్ల మందికి ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించింది. హృద్రోగ బాధితులకు సేవలందించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు నెలకొల్పుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులను గ్రామాలకే పంపిస్తుండగా ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌లో కొత్త అధ్యాయంగా జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలలో రక్తహీనత నివారణకు రూ.6,688 కోట్లతో 35.70 లక్షల మంది లబ్దిదారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కిట్లను అందిస్తోంది. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానం దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్లతో 3.94 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.2,087 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందించింది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే వద్ద రూ.16 వేల కోట్లతో 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో 4 కొత్త ఓడరేవులను నిర్మిస్తోంది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రూ.3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండగా గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్‌పోర్టులను విస్తరిస్తోంది. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 56 నెలల్లో 311కి పైగా భారీ, మెగా పరిశ్రమలు స్థాపించగా 1.30 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో రూ.13.11లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయానికి ‘భరోసా’ సొంత భూమిని సాగుచేసుకుంటున్న రైతులకే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ (అటవీ), ఎండోమెంట్ భూముల సాగుదారులకు సైతం వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.33,300 కోట్లు జమ చేమ చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనం నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్ని వ్యవసాయ సేవలను అందిస్తోంది. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు అందించగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1977 కోట్లు అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1835 కోట్లు వడ్డీ రాయితీ జమ చేసింది. మరో 25ఏళ్ల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత వ్యవసాయ విద్యత్ అందించేందుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. ఉచిత విద్యుత్‌తో 39.77లక్షల మంది రైతులు రూ.43,066 కోట్లు లబ్ధి పొందారు. ఆక్వా రంగంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా ఏకంగా 30 శాతం ఉంది. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందించేందుకు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను నిర్మించింది. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఆక్వా రైతులకు యూనిట్‌కు కేవలం రూ.1.50 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తూ 3,250 కోట్లు సబ్సిడీ భారాన్ని భరించింది. రూ.1,052 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను రూపుమాపి ఇప్పటి వరకు 36.60లక్షల మంది రైతుల నుంచి రూ. 63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సంపూర్ణ మద్దతు ధర అందించింది. మూతపడిన సహకార డెయిరీలను పునరుజ్జీవం పోస్తూ అమూల్ సహకారంతో జగనన్న పాలవెల్లువను కొత్త పుంతలు తొక్కిస్తోంది. మహిళకు సాధికారత.. ఎన్నికల హామీలో భాగంగా స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. నాలుగు దశల్లో 78.94 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.25,571 కోట్లను జమ చేసింది. సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు అందించింది. వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు రూ.14,129 కోట్ల సాయాన్ని అందించింది. కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.1257 కోట్లు పంపిణీ చేసింది. మహిళల భద్రత కోసం దిశ యాప్, సచివాలయాల్లో మహిళా పోలీసు కానిస్టేబుళ్లను నియమించింది. నిరుపేదల కలను నెరవేరుస్తూ 31.19 లక్షల మందికి మహిళల పేరిట ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు 22 లక్షల గృహాలను నిర్మిస్తోంది. సుమారు రూ.మూడు లక్షల కోట్ల సందపను సృష్టించి మహిళలకు అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అండగా నిలుస్తోంది. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాలకు కనీసం 10వ తరగతి విద్యార్హతను ప్రామాణికంగా నిర్ణయించి ఇప్పటివరకు 46,062 మంది లబ్దిదారులకు రూ.349 కోట్లు పంపిణీ చేసింది. జలయజ్ఞం ఫలాలు.. నీటిపారుదల రంగంలో ప్రభుత్వ దార్శనికత కోట్లాది మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తోంది. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు పూర్తి కాగా రూ.600 కోట్లతో బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను పరిష్కరించింది. చిత్రావతి కోసం రూ.280 కోట్లతో భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తి చేసి 10 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. గండికోట నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం రూ.925 కోట్లు వెచ్చించింది. అవుకు 2వ సొరంగం పనులు పూర్తి చేసి ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో లక్కసాగరం ఎత్తిపోతల పూర్తి కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్‌లో నీటిని నిల్వ చేయనుంది. రూ.240 కోట్లతో మడకశిర బైపాస్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీటి పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది. రూ.340 కోట్లతో వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించింది. మార్చి నాటికి నాగావళి, వంశధార అనుసంధానం, జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ 2వ దశ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి 800 అడుగుల్లో 3 టీఎంసీల నీటిని మళ్లిస్తాం. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కుందూ నది, నిప్పుల వాగు సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి నీరందించేందుకు జిల్లెడు బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టాం.హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ప్రారంభించగా తారకరామ తీర్థ సాగర్, తోటపల్లి కెనాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 17,460 రెవెన్యూ గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడంతో పాటు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ♦ వర్క్‌ఫ్రమ్ హోమ్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వైఎస్సార్ గ్రామ డిజిటల్ లైబ్రరీలను 12,979 పంచాయతీల్లో నిర్మిస్తూ అపరిమిత బ్యాండ్‌విడ్త్ సౌకర్యం కల్పిస్తోంది. ♦ వైఎస్సార్ వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు, నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న చేదోడు కింద నాయీబ్రహ్మణులు, దర్జీలకు రూ.1268 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.540 కోట్లు అందించింది. ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.3374 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ.88.33 కోట్లు రీయింబర్స్ చేసింది. ♦ ప్రమాదాల్లో మరణించినవారు, దివ్యాంగులకు వైఎస్సార్ బీమా ద్వారా రూ.1582 కోట్లు అందించింది. ♦ ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో పారదర్శకంగా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందిస్తోంది. ♦ టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్‌తో కలిసి రూ.1,695 కోట్లతో 3,967 ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా 3వేల మంది అర్చకులకు రూ.48.33 కోట్ల మేర ఆర్థిక భరోసా అందించింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించింది. ♦ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించింది. ♦ గ్రామాల్లో యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, సమాజంలో ఆరోగ్యకర జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింది. -
ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గతేడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని చెప్పారు. తుది జాబితా ప్రచురణకు ముందు 2 నెలల పాటు ప్రధానంగా 18–19 ఏళ్ల వయసున్న వారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరం కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులను గవర్నర్ అందజేశారు. ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలలక్ష్మి, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావులకు పురస్కారాలను అందజేశారు. ఈఆర్వోలైన నెల్లూరు మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్డీసీ రామలలక్ష్మి, భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏఈఆర్వోలైన కోడుమూరు మండలం తహశీల్దార్ జయన్న, మైదుకూరు తహశీల్దార్ అనురాధ, గిద్దలూరు తహశీల్దార్ సీతారామయ్య, మరో 23 మంది బీఎల్వోలను, సీఈవో కార్యాలయానికి చెందిన ఎస్వో శ్రీనివాసరావు, ఏఎస్వో సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని గవర్నర్ సత్కరించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అందరం దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు రాజ్‌భవన్‌వర్గాలు గురువారం తెలిపాయి. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
విశాఖపట్నం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విశాఖ నగరంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నజీర్ -
మహా శక్తివంత దేశంగా భారత్
తిరుపతి సిటీ/తిరుమల: ప్రపంచంలో భారత్ మహా శక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య, ఆర్థిక సేవలు, పేదలకు పక్కా గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ప్రధాని మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకు లభించే ప్రయోజనాలు, వివిధ సౌకర్యాలను మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ.5 లక్షలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన, పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్, రైతుల కోసం పీఎం కిసాన్, పీఎం కిసాన్ సమ్మాన్, పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ్ అభియాన్, పేదరిక నిర్మూలన కోసం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం జన్‌ధన్, పీఎం జన్ఔషధి యోజన, పీఎం స్వామిత్ర, పెన్షన్ యోజన, ముద్ర యోజన, డిజిటల్ ఇండియా, పీఎం ఫజల్ యోజన, విశ్వకర్మ యోజన, ఉపాధి కల్పన కోసం స్టార్టప్ ఇండియా, అంకుర భారత్, స్వదేశీ దర్శన్, ఉడాన్ పథకం వంటి పథకాలను అందిస్తోందన్నారు. ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్ర«థమ ఉద్ధేశమన్నారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు. తిరుమల చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. -
Sakshi Excellence Awards 2023 : కన్నులపండువగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు (ఫొటోలు)
-
ప్రతిభా పురస్కారాల సాక్షిగా..
'నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. పూట గడవని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... అలాగే పిన్న వయస్సులోనే ప్రతిభ చూపేవారు... తమ ప్రతిభను సమాజ హితం కోసం... దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు... ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు ఎందరో... ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... సత్కరించి గౌరవిస్తోంది. ఇందులో భాగంగా 9వ ఎడిషన్‌కు సంబంధించిన ‘సాక్షి’ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో నవంబర్ 16, గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.' లాన్స్‌నాయక్ బొగ్గల సాయి తేజస్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) చిత్తూరుజిల్లాలోని ఎగువ రేగడ పల్లి గ్రామానికి చెందిన యువతేజం బొగ్గల సాయితేజ బాల్యం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌లో ఆర్మీజవాన్ గా చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. స్వల్పకాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయితేజ. అతని శక్తియుక్తులను గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్... ఆయనను తన వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. అయితే... అనూహ్యంగా 2021 డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సోదరుడు మహేష్ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్ లాన్ ్స నాయక్ సాయితేజకు సెల్యూట్ చేస్తూ సాక్షి ఎక్సలెన్ ్స – మరణానంతర పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది సాక్షి మీడియా గ్రూప్. తల్లిదండ్రుల స్పందన: మా సాయితేజ చిన్నప్పటి నుంచే దేశం గురించి ఆలోచించేవాడు. దేశసేవ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనే సొంతంగా వెళ్లి ఆర్మీలో సెలక్ట్ అయ్యాడు. అక్కడ దేశం కోసం అమరుడయ్యాడు. కొడుకు మీద మీద ప్రేమతో గుడికట్టి, మేమూ ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాం. ఈ అవార్డు మాకు నిత్య స్మరణీయం. పంతంగి భార్గవి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (ఎడ్యుకేషన్) పంతంగి భార్గవి తండ్రి ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చదువుల తల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పట్టి చిక్కుప్రశ్నలు పరిష్కరించే మెళకువలను ఆకళింపు చేసుకుంది భార్గవి. కరోనా మహమ్మారి విరుచుకుపడినా మనోధైర్యం కోల్పోకుండా ఆన్ లైన్ క్లాసుల ద్వారా సాధన కొనసాగించింది. జేఈఈ అడ్వాన్ ్సడ్ ఎగ్జామ్‌లో ర్యాంక్ సాధించి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్‌లో చేరింది... సాధన చేస్తే సాధ్యం కానిదేమీ లేదని నిరూపించిన భార్గవిని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎడ్యుకేషన్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. భార్గవి సోదరి స్పందన: మా అమ్మానాన్న మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను బీటెక్ చేసి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు. చెల్లికి ఇంత గొప్ప పురస్కారం లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. పార్టిసిపేటరి రూరల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ (ప్రొ. ఎస్వీ రెడ్డి, ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది పార్టిసిపేటరి రూర ల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయం, పర్యావరణం, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మెళకువలు నేర్పిం చి, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు పది వేల నుంచి 25 వేల వరకు అధికంగా ఆదాయం చేకూరుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఈ సొసైటీ ని ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం లాభదాయకమే. ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త వంగడాలతో శ్రద్ధగా సేద్యం చేయాలి. రైతులకు నేను చెప్పే మాట ఒక్కటే... ‘రసాయన ఎరువులకు బదులు గ్రీన్ లేబుల్ ఉన్న పెస్టిసైడ్స్‌ని వాడాలి’. తెలుగు నేలకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చిన ఈ అవార్డు అమ్మ ప్రశంసలా ఉంది. కేడర్ల రంగయ్యఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కొమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ... తన ఇద్దరు పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషిఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280 కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. సామాజిక రుగ్మతలైన బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్‌షాపులు తొలగింపు కోసం నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల భవితకు పాటుపడుతున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎక్సలెన్్స ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: పిల్లలను చైతన్యవంతం చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చన్నది నా ఆలోచన. నాకు భార్య çసహకారం ఉంది. సాక్షి పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని సాధిస్తా. సునీల్ యల్లాప్రగడ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) కాంపోజిట్ మెటీరియల్స్‌తో సరికొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. రైల్వేస్, ఆటోమోటివ్, విండ్, మెరైన్, డిఫెన్ ్స తదితర సంస్థలకు అవసరమైన డిజైన్, టూలింగ్, కాంపోజిట్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తోంది. ట్రియోవిజన్ ఉత్పత్తులు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రసాయనాలు, మంటల నుంచి రక్షణ కల్పిస్తాయి. తుప్పుపట్టవు. దేశీయంగానే కాకుండా గ్రీస్, యుఏఈ, నైజీరియా తదితర దేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ట్రియోవిజన్ . కాంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ యల్లాప్రగడను సాక్షి స్మాల్ / మీడియం స్కేల్ – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: మేం తయారుచేస్తున్న ఉత్పత్తులను స్వదేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సాక్షి మీడియా సంస్థ సత్కరించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొమెర అంకారావు (జాజి) ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఇండివిడ్యువల్) పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావుకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రోజూ అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం... మొక్కలు నాటడం అలవాటు. అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేయడం, వేసవిలో మొక్కలకు నీళ్లుపోసి సంరక్షించడం, వారంలో నాలుగు రోజులు అడవుల్లోనే సంచరించడం, రెండురోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం అభిరుచులు. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పంట పండించి పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. అంకారావు నిస్వార్థ సేవకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వన్యప్రేమికుడైన అంకారావు ఉరఫ్ జాజిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: ఈ పని చేస్తే అవార్డులు వస్తాయని కూడా తెలియదు. సుచిర్ ఇండియా నుంచి సంకల్పతార, దయానంద సరస్వతి సంస్థ నుంచి వృక్షమిత్ర, చెన్నై ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్æ పురస్కారాలందుకున్నాను. అవార్డులు వస్తాయని పనిచేయలేదు, అవార్డులు రాకపోయినా పని ఆపను. డాక్టర్ చినబాబు సుంకవల్లి (ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్) క్యాన్సర్ సోకి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు డాక్టర్ చినబాబు సుంకవల్లి. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ ముప్పు తప్పించవచ్చనే ఆలోచనతో 2013లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆర్థికస్తోమత లేని రోగులకు అవసరమైన వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మురికివాడలు, పల్లెలు, పట్టణాలు, గిరిజన తండాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది ఈ ఫౌండేషన్. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు లక్షమందికి వైద్య పరీక్షలు చేశారు. క్యాన్సర్ రోగులకు తనవంతు సేవ చేస్తున్న సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లిని సాక్షి ఎక్సలెన్ ్స ఇన్ హెల్త్ కేర్ అవార్డ్‌తో పురస్కరించింది. పురస్కార గ్రహీత స్పందన: వైద్యరంగంలో చికిత్స మాత్రమే కాదు, అంతకుమించిన సేవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ధైర్యం చెప్పి సాంత్వన కలిగించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చైతన్యవంతం చేయడం వంటివి. మా సేవలను గుర్తించి సాక్షి ఇచ్చిన ఈ అవార్డు రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుంది. నెలకుర్తి సిక్కిరెడ్డి (యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్) తన ఆటతీరుతో జాతీయ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న నెలకుర్తి సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు. తల్లి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు పేరెంట్స్. ఆమెకు బ్యాడ్మింటన్‌లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోరమైన శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్పకాలంలోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. 2007లో కెరీర్లో తొలి అంతర్జాతీయ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో పాల్గొంది. బ్యాడ్మింటన్ లో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడల్లో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్ ్స యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కెరీర్ మొదలు పెట్టిన తొలిరోజుల్లో ప్రారంభమైన సాక్షి, మొదటి నుంచి నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రతి అవార్డూ దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిదే. సాక్షి పురస్కారం అర్జున అవార్డు మరోసారి అందుకున్నంత ఆనందాన్నిస్తోంది. జాస్పర్ పాల్ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల జాస్పర్పాల్.... 2014లో ఒక ఘోర రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అది దేవుడు తనకు ఇచ్చిన పునర్జన్మగా భావించిన జాస్పర్ ఆ క్షణమే ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. నిలువ నీడ లేని వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 2017లో సెకండ్ ఛాన్ ్స ఫౌండేషన్ స్థాపించారు. పుట్‌పాత్‌లపై నిస్సహాయంగా పడి ఉన్న వృద్ధులను చేరదీసి.. జీవిత చరమాంకంలో వారికి ఊరట కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి ఆశ్రయం కల్పించారు. 300 మందిని తిరిగి వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. హైదరాబాద్‌లో జాస్పర్ నిర్వహిస్తున్న షెల్టర్‌హోమ్స్‌లో సుమారు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు...ఫ్రీ హాస్పిటల్ ఫర్ ది హోమ్‌లెస్ పేరుతో నిలువ నీడలేని వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న జాస్పర్ పాల్ని సాక్షి యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: తొమ్మిదేళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. రకరకాల కారణాలతో వృద్ధులను వారి పిల్లలు వదిలేయడం గమనించాను. ఒంటరి వృద్ధులను చూసినప్పుడు బాధగా అనిపించేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలని ఓల్డేజీ హోమ్ ఏర్పాటు ద్వారా ఎందరో వృద్ధులను కాపాడగలిగాను. దీన్ని సాక్షి గుర్తించి అవార్డు ఇవ్వడం... పెద్దల ఆశీస్సులు లభించినంత ఆనందంగా ఉంది. డాక్టర్ పద్మావతి పొట్టబత్తిని ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ వైకల్యం ఆమె అభిరుచిని అడ్డుకోలేకపోయింది. సంకల్పం ఆమెకు కొత్తదారి చూపింది. ఆవిడే పద్మావతి పొట్టబత్తిని. పసితనంలో పోలియో బారినపడ్డా, చెక్కుచెదరని మనోబలంతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తనలోని కళాభిరుచికి రెక్కలు తొడిగి రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్యాంగుల కోసం ఒక సంస్థను ఏర్పాటుచేసి వారికి కంప్యూటర్స్, నృత్యం, సంగీతం, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్న పద్మావతిని పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న పద్మావతిని ఎక్సలెన్ ్స ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: చిన్ననాటి నుంచి ఆర్టిస్టుగా ఉండటం వల్ల నాలాగా కళాకారులు అవ్వాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలనుకున్నాను. నేను ఎదుర్కొన్న సమస్యలు మిగతావారు ఫేస్ చేయకూడదని వారికి మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నా కృషిని గుర్తించి, ఈ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉంది. డా. బి. పార్థసారథి రెడ్డి, ఛైర్మన్ (హెటిరో డ్రగ్స్) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ (సుధాకర్ రెడ్డి, హెటిరో గ్రూప్ డైరెక్టర్) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో ఫార్మాస్యూటికల్స్ తమ విభిన్నమైన ఉత్పత్తులతో పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ పరంగా దేశవిదేశాల్లో విశేషమైన గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే డ్రగ్స్‌ను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్ చికిత్సలో వినియోగించిన ఔషధాలను పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధాల ఉత్పత్తికి అంకితమై, విశేష కృషి చేస్తున్న హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా. బి.పార్థసారథి రెడ్డిని బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లార్జ్‌స్కేల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. స్పందన: (సుధాకర్ రెడ్డి, డైరెక్టర్, అవార్డు అందుకున్నారు) మా వంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన ఔషధాల తయారీలో ముందుంటున్నాం. అదే నిబద్ధతతో ప్రయోగాలను కొనసాగిస్తూ మందులను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (కార్పొరేట్) (ఎమ్.వెంకట నారాయణ రెడ్డి, సీఈవో) వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం నెక్ట్స్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ... క్లీన్ఎనర్జీతో ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణాకోర్సుల నిర్వహణతోపాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్ ఆఫ్– గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న నెక్స్ట్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ప్రతినిధి ఎస్. వెంకట నారాయణరెడ్డిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ – కార్పొరేట్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: సాక్షి సంస్థ మా సర్వీస్‌ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఊహించని సంతోషం. సేవ చేసే వారిని గుర్తించి గౌరవించడం పెద్ద బాధ్యత. సాక్షి అంత పెద్ద బాధ్యతను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ) (ఉదయ్ పిలాని, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్. హానికారకమైన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీ సైక్లింగ్ చేయడం అనే బృహత్కార్యాన్ని తన భుజాన వేసుకుంది ఈ క్లబ్. గత పదేళ్లుగా విశాఖలోని బీచ్, అపార్ట్మెంట్స్, మార్కెట్ ప్రాంతాల్లో ఇండియా యూత్ ఫర్ సొసైటీతో కలిసి జీవీఎం సహకారంతో ఒక ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్‌షాప్స్ ఫలితంగా ప్రజల్లో ఆశాజనకమైన మార్పు అంకురిస్తోంది. పుడమితల్లిని కాపాడుకునేందుకు తోడ్పాటునందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ పిలానిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్సర్వేషన్ – ఎన్జీవో అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: పర్యావరణంపై చూపే ప్రేమ ఈ రోజు ఇంతమంది ముందుకు తీసుకువచ్చింది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు సత్కారం మా రోటరీ క్లబ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ అవార్డు ఒక మైల్స్టోన్ లాంటిది. కృష్ణ కుమ్మరి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు యువశాస్త్రవేత్త కృష్ణ కుమ్మరి. స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం...దానికితోడు చిన్నతనంలో సోకిన పోలియో. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ... తిరుపతిలో డిప్లొమో, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ఇక చాలు అనుకోలేదు... 2018లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. చంద్రయాన్ – 3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో పనిచేసి ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్ 3 ప్రయోగంతో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కృష్ణని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఇస్రో వరకు వెళ్లాను. కానీ, అవార్డులు నన్ను వరిస్తాయని ఊహించలేదు. ఇంత గొప్ప వేదికపైన సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్గీయ సి.ఆర్. రావు తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ పద్మ విభూషణ్ డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావ్... కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎం.ఎ. స్టాటిస్టిక్స్ చదివి... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్లో డైరెక్టర్‌గానూ, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించి 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్ ్స పురస్కారాన్ని అందుకున్నారు. భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్–2023 అవార్డును అందుకున్నారు సీఆర్ రావు. 102 ఏళ్ల వయసులో ఇటీవలే తుదిశ్వాస విడిచారు. గణాంక శాస్త్రంలో ఆయన అందించిన విశేషమైన సేవలను స్మరించుకుంటూ ఎక్సలెన్ ్స ఇన్ ఎన్ ఆర్ఐ అవార్డ్‌తో గౌరవించింది సాక్షి మీడియా గ్రూప్. డాక్టర్ సిఆర్ రావు మేనల్లుడు డాక్టర్ యు.యుగంధర్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ –ఏఐఎమ్ఎస్సిఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్) అవార్డును స్వీకరించారు. -
సాగరతీరంలో సాహస విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా కనిపించే విశాఖ సాగరతీరం ఆదివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బాంబుల వర్షం.. యుద్ధ విమానాల చక్కర్లు, శత్రుమూకల దాడులు.. యుద్ధ ట్యాంకర్ల వీర విహారంతో.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. శత్రుదేశం పాక్‌పై విజయానికి ప్రతీకగా ఏటా విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఆదివారం నేవీడే విన్యాసాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా నేవీ బ్యాండ్, నేవల్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలతో ప్రారంభమైన విన్యాసాలు.. మార్కోస్ రాకతో వేడెక్కాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వైమానిక దళాల అద్భుత ప్రదర్శనలు, యుద్ధ, నిఘా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక విన్యాసాలతో కూడిన ఫ్లాగ్షిప్ ఈవెంట్ అద్భుతంగా సాగింది. చివరిగా.. యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణతో నేవీడే విన్యాసాల్ని ముగించాయి. విన్యాసాలకు విశిష్ట అతిథులుగా మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఎంపీ డా.సత్యవతి, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ రవిశంకర్, జేసీ విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం.. నేవీ హౌస్‌లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ‘ఎట్ హోమ్’ ఫంక్షన్ పేరుతో నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పటిమని చాటిచెప్పే వీడియోను గవర్నర్ ఆవిష్కరించి తిలకించారు. -
నేడు నేవీ డే
సాక్షి, విశాఖపట్నం: భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో జరుగుతుంది. ఈ ఏడాది మిచాంగ్ తుపాను కారణంగా 4న∙జరగాల్సిన వేడుకల ను 10కి వాయిదా వేశారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలను ప్రదర్శిస్తారు. సుమారు 2 వేలమంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ముఖ్య అతిథిగా గవర్నర్ నజీర్ నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 1 గంటకు పోర్టు గెస్ట్‌హౌస్‌కు వస్తారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, అనంతరం తూర్పు నౌకాదళ (ఈఎన్సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందుకు హాజరవుతారు. తిరిగి రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి ఘనస్వాగతం
సాక్షి, తిరుపతి/రేణిగుంట (తిరుపతి జిల్లా)/తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, రెడ్డెప్ప, జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్‌రావు, వెంకటేగౌడ, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ డీకే బాలాజి, తిరుపతి కమిషనర్ హరిత, పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక కాన్వాయ్ ఆపి బీజేపీ శ్రేణులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరి వెళ్లారు. తిరుమలకు చేరుకున్న ప్రధాని ఇక తిరుమలకు చేరుకున్న ప్రధాని మోదీకి శ్రీ రచనా అతిథిగృహం వద్ద ఈఓ ధర్మారెడ్డి, రచనా టెలివిజన్ డైరెక్టర్ తుమ్మల రచనా స్వాగతం పలికారు. శ్రీవారిని ఆయన సోమవారం ఉదయం దర్శించుకుంటారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. -
పురస్కార విజేతలు.. స్ఫూర్తి ప్రదాతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు గర్వించే విజయాలు సాధించిన వారికి తగిన గుర్తింపును అందించడంలో సాక్షి మీడియా గ్రూప్ కృషి ప్రశంసనీయమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారిని గౌరవించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 9వ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయం, క్రీడలు, ఆరోగ్యం, పర్యావరణం లాంటి రంగాల్లో అవార్డు గ్రహీతలు సమాజంపై చెప్పుకోదగిన ప్రభావం చూపారని, వారి శ్రమకు ఈ పురస్కారాలు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీ గవర్నర్.. ‘మానవ సేవను మించిన అత్యుత్తమ మతం లేదు..’ అన్న ఉడ్రో విల్సన్(ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు) సూక్తిని ఉటంకించారు. సమాజ సేవ చేసే ఎన్జీవోలు, సంస్థలు, విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ పనితీరును ఆయన అభినందించారు. వ్యయ ప్రయాసలకోర్చి సాక్షి మీడియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందన్నారు. అవార్డు గ్రహీతలను.. పేరు పేరునా వారి విజయాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నజీర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. రైతుల కష్టాలను కళ్లకు గట్టిన సుమధుర ఆర్ట్స్ అకాడమీ నృత్య రూపకం, ఇతర సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
అసామాన్యులకు సత్కారం
వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు 78 లక్షల ఇళ్లు, 108 అంబులెన్స్, కోటి ఎకరాలకు సాగు నీరు, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడటం, ప్రధానంగా జలయజ్ఞం ద్వారా వైఎస్సార్ అందరి హృదయాల్లో నిలిచి పోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. – అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్ ఈ అవార్డులు అందుకుంటున్నవారంతా తమ తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారు. మన వారసత్వాన్ని తమ భుజాల మీద మోస్తున్నారు. వీరంతా మన జాతి సంపద. ఈ రోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ మూడేళ్లలో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్సార్ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన వేసిన బాటను ఎన్నో రాష్ట్రాలు అనుసరించాయన్నారు. ఇంత గొప్ప దార్శని కుడి పేరిట అవార్డులు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తొలుత రాష్ట్ర ప్రజలకు అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు–వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు–2023 ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో వేడుకగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామాజిక సేవ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో 23 మందిని లైఫ్ టైం అచీవ్మెంట్, నలుగురిని అచీవ్మెంట్ పురస్కారాలతో సత్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్– వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డ్స్‌ను తన చేతుల మీదుగా అందించడం ఆనందాన్నిస్తోందన్నారు. దివంగత వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఉమ్మడి ఏపీలో పేదలకు 78 లక్షల ఇళ్లను కట్టించారని, ఆయన ప్రారంభించిన 108 అంబులెన్సు సేవలను దేశంలో 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు. రైతాంగాన్ని వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడేందుకు 30 భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, 18 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలయజ్ఞం ప్రారంభించిన ఘనత ఆయనదేనన్నారు. అదే బాటలో సీఎం జగన్ సాగుతున్నారన్నారని చెప్పారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకుంటున్న కరణం మల్లీశ్వరి ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి ఏపీ మూడు ప్రధాన రంగాలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాల్లో అద్భుతమైన పని తీరుతో 2022–23 సంవత్సరానికి 16.22% వృద్ధి రేటుతో ఏపీ గొప్ప పురోగతి సాధించిందన్నారు. 2021–22లో తలసరి ఆదాయం 14.02%తో ఆకట్టుకునే వృద్ధి రేటు నమోదు చేసిందని, సంవత్సరానికి జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43%గా ఉందన్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం అని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తూ, పరిపాలనను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించాయని కితాబిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక, సామాజిక శ్రేయస్సు, ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల కింద వివిధ ప్రధాన సంక్షేమ కార్యక్రమాలకు రూ.2.38 లక్షల కోట్లు వెచ్చించడం గమనార్హం అన్నారు. నవరత్నాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, 56% రాజకీయ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించడం గొప్ప విషయమన్నారు. నామినేటెట్ పోస్టుల్లోనూ సగానికి పైగా ఈ సామాజిక వర్గాల వారికి కేటాయించడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం 7వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో మంచి ప్రగతి సాధించిందని చెప్పారు. మార్చిలో విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించిందని, తద్వారా ఈ ఏడాది 16 కీలక అభివృద్ధి రంగాలలో 6 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీ స్థిరంగా ఒకటో స్థానంలో కొనసాగుతోందని చెప్పారు. 26 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 108 పోలీసు డివిజన్లు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా పరిపాలనను వికేంద్రీకరించారన్నారు. పురస్కార గ్రహీతలు మన సంపద: సీఎం జగన్ సీఎం జగన్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ అవతరించి నేటికి 67 సంవత్సరాలైందని, వరుసగా మూడో ఏడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించుకోవడం అనందంగా ఉందన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహనీయులను గౌరవిస్తూ వైఎస్సార్ అవార్డులతో మూడేళ్లుగా సత్కరించుకునే సంప్రదాయం పాటిస్తున్నామని తెలిపారు. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులని తెలిపారు. ఈ ఏడాది 27 మందిని వైఎస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నామని, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్, నలుగురికి అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. ‘తెలుగుదనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైఎస్సార్. ఆ మహనీయుని పేరిట ఏటా ప్రభుత్వం అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం.. ఇలా ఏ రంగం తీసుకున్నా అంతకు ముందున్న చరిత్రగతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన విషయం చూశాం. మన వ్యవసాయం, చేనేత, తప్పెటగుళ్లు, జానపదం, రంగస్థలంలో రాణిస్తున్న వారికి, అభ్యుదయ.. హేతువాదం, సాటి మనుషులకు విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది’ అని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద రూ.10 లక్షలు, మెమెంటో, ప్రశంసా పత్రం.. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షలు, మెమెంటో, ప్రశంసా పత్రమిచ్చారు. పుల్లెల గోపీచంద్ తరఫున ఆయన సతీమణి లక్ష్మి..రావు బాలసరస్వతి తరఫున ఆమె కుమారుడు అవార్డులు అందుకున్నారు. మంత్రులు, సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అవార్డు కమిటీ సభ్యులు సజ్జల, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, ముత్యాలరాజు, అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ అవార్డు గ్రహీతల నేపథ్యం 1. పాంగి వినీత, మహిళా రైతు, అల్లూరి సీతారామరాజు జిల్లా (వైఎస్సార్ అచీవ్మెంట్) సేంద్రీయ విధానాలను పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. రైతు సాధికార సంస్థ సహాయంతో కషాయాల తయారీ.. రైతులకు పంపిణీ చేయడంతో పాటు పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2. డాక్టర్ వై.వి.మల్లారెడ్డి, అనంతపురం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ సామాజిక కార్యకర్త ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)లో 42 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. 15 ఏళ్లుగా అసియన్ ఫ్రాటెర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 235 గ్రామాల పరిధిలో 60 వేల మందికి పైగా రైతులు, భూమి లేని వారు, ఇతర వర్గాలతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. జీవావరణం, పర్యావరణం వంటి రంగాల్లో సేవలు అందిస్తున్నారు. 3. యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) చిన్ననాటి నుంచే కళలపై మక్కువ ఉన్న ఈయన నక్షత్రక, శ్రీకృష్ణ, శ్రీరాముడి పాత్రలకు జీవం పోశారు. 14 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాల ద్వారా అరంగేట్రం చేసి 5 దశాబ్దాలుగా సాంఘిక, పౌరాణిక పాత్రల ద్వారా వేలాది ప్రదర్శనలిచ్చారు. 4. తలిశెట్టి మోహన్, కలంకారీ కళాకారుడు, తిరుపతి (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) 1974 నుంచి కలంకారీ కళకు విశేష సేవలు అందిస్తున్నారు. సహజ రంగులతో అద్దకం, ఫ్యాబ్రిక్ తయారీలో నేటి కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. 1990లో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ మెరిట్ అవార్డు అందుకున్నారు. 5. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ, బాపట్ల (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు. ఆదిభట్ల నారాయణ దాసు ప్రియశిష్యుడు. ఈయన హరికథ వింటుంటే.. సినిమా చూస్తున్నట్లు కళ్లకు కట్టినట్లు ఉంటుందని పేరుగడించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 1500కు పైగా హరికథా ప్రదర్శనలిచ్చారు. భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 6. కోన సన్యాసి, తప్పెటగుళ్లు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఉత్తరాంధ్రలో తప్పెటగుళ్లు సన్యాసిగా పేరుపొందారు. తెలుగు జానపదాలకు తప్పెటగుళ్లు పాట, ఆటతో దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చారు. ఈ కళకు జీవం పోస్తున్నారు. తన ఇద్దరు కుమారులకు తప్పెటగుళ్లు కళను నేర్పించారు. 7. ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ, కాకినాడ (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) 1938లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీలో 515 మంది సభ్యులున్నారు. 1986లో ఈ సొసైటీ రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఉప్పాడ జమ్దానీ పట్టు చీర 1999లో భౌగోళిక గుర్తింపు పొందింది. 8. ఎస్వీ రామారావు, అంతర్జాతీయ చిత్రకారుడు, కృష్ణా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ కళాకారుడు, కవి, విద్యావేత్త, రచయిత. సమకాలీన ప్రపంచ కళాత్మక సంప్రదాయానికి మరింత వన్నె తెచ్చారు. తూర్పు– పశ్చిమ కళలకు వారధిగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. 9. రావు బాలసరస్వతి, తొలితరం నేపథ్య గాయని, నెల్లూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఈమె తొలితరం తెలుగు సినీ నటి, నేపథ్యగాయని. ఆరో ఏటనే గాత్ర కచేరి ప్రారంభించిన బాల సరస్వతి లలిత సంగీత సామ్రాజ్ఞిగా ప్రసిదిగాంచారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఈమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. 10. తల్లావఝుల శివాజీ, చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్) తండ్రి శివశంకర శాస్త్రి నుంచి కళాసాహిత్యం అలవడింది. బొమ్మలు గీయడం చిన్నప్పటి నుంచే స్వయం కృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగ విరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రకృతి, ఆ జీవన విధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరత, ఇతిహాసాలు ఈయన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 11. డాక్టర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి, జానపద కళలు, అనంతపురం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో రికార్డు స్థాయిలో 35 పీహెచ్డీ డిగ్రీలు, 66 ఎంఫిల్ డిగ్రీలను ప్రదానం చేశారు. జానపద కళలను పర్యవేక్షించి మార్గదర్శకత్వం వహించిన ఏకైక ప్రొఫెసర్‌గా దేశంలోనే ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో జానపద ప్రదర్శన కళలలో తొలిసారిగా పీహెచ్డీ అందించడంలో ప్రత్యేకతను సాధించారు. జానపద కళలు, జానపద సంస్కృతిపై పుస్తకాలను రచించారు. 12. కలీషాబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుభానీ దంపతులు, నాదస్వరం, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రకాశం జిల్లా పెద కొత్తపల్లికి చెందిన షేక్ మహబూబ్ సుభానీ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు. కలీసాహెబీ మహబూబ్ పూర్వీకులూ నాదస్వరం విద్వాంసులు కావడం విశేషం. ఈ దంపతులు భారత్‌తో పాటు అబుదాబి, జపాన్, మలేషియా, తదితర దేశాల్లో నాదస్వర కచేరీలు ఇచ్చారు. 13. ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం, పశ్చిమ గోదావరి (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) సంస్కృతాంధ్ర పండితుడు, పద్య కవి, అవధాని, కథకుడు, అనువాదకుడు, అధ్యాపకులు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ‘దేవీ భాగవతం’ వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 14. ఎండీ ఖదీర్‌బాబు, రచయిత, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్మెంట్) మహమ్మద్ ఖదీర్‌బాబు ప్రసిద్ధ తెలుగు కథా రచయిత, నూతన తరం తెలుగు కథకులలో ప్రత్యేకౖమెన స్థానం. ప్రపంచంలోని పలు భాషల సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లో అనువదించేందుకు ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ‘చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్’కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ లభించడం ఇదే తొలిసారి. 15. మహజబీన్, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్మెంట్) మహజబీన్ న్యాయవాద విద్యను అభ్యసించారు. తన కవితా సంకలనం ‘ఆకు రాలు కాలం’ 1997లో ప్రచురితమైంది. ఈమె తన కవిత్వంలో లింగ న్యాయం, శాంతి, పర్యావరణం, మహిళలు, పిల్లల హక్కులపై దృష్టి పెట్టడం విశేషం. 16. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, చిత్తూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980, 1990ల్లో ఈయన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సాధారణ రాయలసీమ వాడుక భాషలో పిల్లలు తేలికగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రచించారు. ఆయన జీవితానుభవాలనే కథలుగా రచించి పాఠకుల మన్ననలు పొందారు. 17. అట్టాడ అప్పలనాయుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) అట్టాడ అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథ, నవలా రచయిత. శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితులై జననాట్య మండలిలో పని చేశారు. పార్వతీపురంలో ఇంటర్ చదివి జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పని చేశారు. తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించారు. 18. పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్, గుంటూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) గోపీచంద్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్‌గా ఉన్నారు. ఈయన 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 19. కరణం మల్లీశ్వరి, వెయిట్ లిఫ్టింగ్, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లేశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. 2022లో ఈమెకు బీబీసీ లై‹ఫ్టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. 20. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరుకి చెందిన ఈయన 40 ఏళ్లుగా విజయవాడలో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 50 పడకల మానసిక వ్యాధుల ఆసుపత్రి ‘ఇండ్లాస్’ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. 21. డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ, డాక్టర్, వైఎస్సార్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, బీఏహెచ్‌ఏ సర్వే, గురకకు శస్త్రచికిత్స, మైక్రో ఇయర్ సర్జరీలలో ప్రసిద్ధుడైన ఈఎన్టీ స్పెషలిస్ట్. హైదరాబాద్ అపోలో హెల్త్ సిటీతో అనుబంధం ఉన్న వినయ్ కుమార్ ట్రస్ట్‌తో పాటు వినికిడి లోపం ఉన్న వారికి సహాయం చేసేందుకు ‘సహీ’ సొసైటీని ప్రారంభించారు. 22. గోవిందరాజు చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణా జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా గోవిందరాజు చక్రధర్‌ది సుదీర్ఘ ప్రస్థానం. మీడియా వ్యాఖ్యాత, అనువాదకుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో కంటెంట్ సృష్టికర్త. 23. హెచ్ఆర్కే), ఆధునిక, సంస్కరణవాద కవిత్వం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఆధునిక, సంస్కరణవాద కవిత్వంలో హనుమంతరెడ్డి దిట్ట. హెచ్ఆర్కే అనేది ఈయన పేరుకు సంక్షిప్త రూపం. కర్నూలు జిల్లాలోని ‘గని’లో 1951లో పేద రైతు కుటుంబంలో జన్మించారు. 24. బెజవాడ విల్సన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) సామాజిక నాయకుడు. భారతీయ మానవ హక్కుల సంస్థ సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకులలో ఒకరు. 2016లో ఈయన రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 25. కుసుమ శ్యాంమోహన్ రావు, డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (వైఎస్సార్ అచీవ్మెంట్) దక్షిణాది రాష్ట్రాల్లో గిరిజన, దళిత గ్రామాల్లోని సమస్యలను, వారి విజయాలను తెలియజేసేలా యూట్యూబ్ ఛానెల్ స్థాపించారు. తన ఛానెల్ ద్వారా అవగాహన కార్యక్రమాలు, ప్రసంగాలు ప్రసారం చేస్తున్నారు. 26. నిర్మల హృదయ భవన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) మదర్ థెరిసా సోదరీమణులు నిర్వహిస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల హృదయ్ భవన్‌ను 1973లో మదర్ థెరిసా ప్రారంభించారు. కులం, మతంతో సంబంధం లేకుండా పేదలను ఆదుకునే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. వీధుల్లో ఒంటరిగా ఉన్న, అనారోగ్యంతో ఉన్న, ఎవరూ పట్టించుకోని వారిని, పిల్లల ఆదరణకు నోచుకోని వారిని ఆదుకుని రక్షణ కల్పిస్తోంది. 27. డాక్టర్ జి.సమరం, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1996–97లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. -
నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం (ఫొటోలు)
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్.. జస్టిస్ ధీరజ్‌సింగ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల పత్రాలపై సంతకం చేశారాయన. ఆపై సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు బూడి ముత్యాలనాయుడు,తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం.. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్‌ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్‌సింగ్. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్‌కు పేరుంది. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు. కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్ 2గా కొనసాగుతారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
ఈమె డాక్టర్ భారతి ఎందరికో స్ఫూర్తి
సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్గానో అసిస్టెంట్ప్రోఫెసర్గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక. ముగ్గురు ఆడపిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది. ఎన్నో కష్టాలు భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది. ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది. పెళ్లి, సంసారం వల్ల చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్ ఇంటర్ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి. పీహెచ్డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి. – రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం) పీహెచ్డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది. 2016లో పీహెచ్డీ సీటు 2016లో సాకే భారతి ఎస్.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్ ఎం.సి.ఎస్ శోభ దగ్గర ఆర్గానిక్ కెమెస్ట్రీలో పిహెచ్.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
ఉద్యాన పంటలకు హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఉద్యాన పంటలకు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మొత్తం 17.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 312.34 లక్షల టన్నుల ఉత్పత్తితో మన రాష్ట్రం ఉద్యానపంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించారు. చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పోషకాహార భద్రత కల్పించేలా ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పటికే స్థూల జాతీయోత్పత్తిలో ఉద్యాన పంటలు ఆరు శాతం ఉండటం శుభపరిణామమని చెప్పారు. ఉద్యానవన రంగం 14శాతం ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని, అందులో 42 శాతం మహిళలకే దక్కడం గొప్ప విషయమన్నారు. సమాజం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ, డ్రోన్ల వినియోగం వల్ల ఉత్పత్తి పెరగడంతోపాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని, ఈ దిశగా యూనివర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతిక సహకారం అందించడంలో ఉద్యాన వర్సిటీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. వర్సిటీ దశాబ్దంన్నర ప్రయాణంలో విద్య, పరిశోధన, విస్తరణ విభాగాల్లో అద్భుత పురోగతిని సాధించిందని, ఇక్కడ అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో కేంద్రం నోటిఫై చేయడం అభినందనీయమన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్ మాట్లాడుతూ ఉద్యాన విద్యలో డిగ్రీలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రైతులకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి టి.జానకీరామ్ వర్సిటీ సాధించిన ప్రగతి, లక్ష్యాల గురించి వివరించారు. అనంతరం 1,069 మందికి బీఎస్సీ హానర్స్, 97 మందికి ఎమ్మెస్సీ, 26 మందికి పీహెచ్డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘గోల్డ్ మెడల్స్’ అందుకున్నవారు వీరే... ఉత్తమ అధ్యాపకుడిగా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ (ఎంటమాలజి)డాక్టర్ ఎన్.ఇమ్మానుయేల్, ఉత్తమ పరిశోధనా శాస్త్రవేత్తగా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.రవీంద్రకుమార్, ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తగా వెంకట్రామన్నగూడెంలోని కేవీకే శాస్త్రవేత్త (మత్స్యసంపద సైన్స్) డాక్టర్ ఎ.దేవీవరప్రసాద్ రెడ్డి బంగారు పతకాలు అందుకున్నారు. అడ్డా వెంకాయమ్మ గోల్డ్ మెడల్‌ను కొత్తకడప లక్ష్మీకళ (ప్రకాశం), డాక్టర్ టీబీ దాశరథి గోల్డ్‌మెడల్‌ను దుర్గావెంకట రవితేజ అములోతు (గుంటూరు), శంబతరు పావని(వైఎస్సార్), దేవరకొండ పుల్లయ్యశాస్త్రి గోల్డ్ మెడల్‌ను దుంపపెంచల విజయ్‌రెడ్డి (నెల్లూరు), నోరు రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), షాహిద్ లెఫ్ట్‌నెంట్ అమిత్ సింగ్ గోల్డ్ మెడల్‌ను రమావత్ తావుర్యనాయక్ (ప్రకాశం), అన్నే శిఖామణి మెమోరియల్ గోల్డ్ మెడల్‌ను దేవిరెడ్డి మేఘన, గరికిముక్కల పరంజ్యోతి అందుకున్నారు. -
అబద్ధాలు అచ్చేసిన రామోజీని సభకు పిలిచి విచారించాలి
సాక్షి, అమరావతి: చట్ట సభను, రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్‌ను కించపరిచేలా అబద్ధాలను ఈనాడులో అచ్చేసి రామోజీరావు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయన్ను సభకు పిలిచి విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభలో అధికారపక్షం డిమాండ్ చేసింది. సీఎం రాకకోసం గవర్నర్ వేచి ఉండాలా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్టు ప్రస్తావిస్తూ ఈనాడు రాసిన తప్పుడు కథనంపై బుధవారం శాసనసభ అట్టుడికింది. గవర్నర్‌ను కించపరుస్తూ ఈనాడు అచ్చేసిన కథనంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టి కేశవ్ తప్పు మాట్లాడారా.. రామోజీ తప్పు రాశారా.. అనే విషయం తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈనాడు వార్త క్లిప్పింగ్‌లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన సభ్యులు.. ఎల్లో మీడియాను ఏకిపారేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని దమ్ముంటే నిరూపించాలని పయ్యావుల కేశవ్ అనడంపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. సభకు దమ్ము ధైర్యం అని సవాలు చేయవద్దని, కేశవ్ తప్పు మాట్లాడినా, ఈనాడు తప్పు రాసినా ప్రివిలేజ్ కమిటీ విచారణలో నిర్ధారణ అయితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ చర్చకు అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభ దృష్టికి వాస్తవాలు తెచ్చేందుకు తొలిరోజున గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ప్రదర్శించి సభ్యులకు వాస్తవాలు చూపించారు. అయినప్పటికీ పయ్యావుల కేశవ్ పదే పదే వాదనకు దిగడంతో గవర్నర్ విషయంలో ఆయన చేసిన కామెంట్ల వీడియో సైతం సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారపార్టీ నేతలు మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే: మంత్రి బుగ్గన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలకడంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ అబద్ధపు రాతలు రాయడం రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి గవర్నర్‌కు ఘనస్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 9.53కు గవర్నర్ వచ్చారు. గవర్నర్‌ను రిసీవ్ చేసుకున్న సీఎం 10.02 గంటలకు స్పీకర్ చాంబర్‌కు తీసుకొచ్చారు. గవర్నర్‌కు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అభ్యర్థన మేరకు కొంత సేపు ఆగి ఆయన రెడీ అయిన తర్వాత గౌరవ సభలోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు, విజన్‌ను గవర్నర్ చదివితే.. ఆ ప్రసంగాన్ని సైతం టీడీపీ సభ్యులు చాలా హేళన చేశారు. తప్పుడు వార్తలతో గౌరవ సభను, గవర్నర్‌ను అవమానిస్తూ కథనాలు రాసిన ఈనాడుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. చంద్రబాబు, ఎల్లో మీడియా తోడుదొంగలు: మాజీ మంత్రి కన్నబాబు టీడీపీకి విషపుత్రికలుగా ఎల్లో మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. చంద్రబాబు, ఎల్లోమీడియా తోడుదొంగలుగా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎల్లో మీడియా వక్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలి. టీడీపీ, ఎల్లోమీడియా అబద్ధాలు ప్రచారం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్నాయి. విలువలులేని టీడీపీ: మంత్రి నాగార్జున ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే గవర్నర్ ప్రసంగం కాగితాలను చించివేసి టీడీపీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయేవారు కాదు. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయం చేస్తున్న టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. సభా హక్కుల ఉల్లంఘన విషయంలో రామోజీరావుపై చర్యలు తీసుకోవాలి. చర్చ జరగాల్సిందే: మంత్రి అంబటి సభలో చర్చ జరగకపోతే ఈనాడు రాసిందే నిజమని ప్రజలు అనుకుంటారు. ప్రజలకు వాస్తవాలను ఈ సభ ద్వారా తెలియచేయాలి. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ సభలో దమ్ము ఉందా అంటూ మాట్లాడటం శోచనీయం. మాకు దమ్ముంది కాబట్టే 151 స్థానాలు ఇచ్చారు. మిమ్మల్ని ప్రజలు దుమ్ముదుమ్ముగా ఓడించారు. మళీŠల్ మిమ్మల్ని ఓడించడం ఖాయం. స్పీకర్‌ను దమ్ముందా అంటూ మాట్లాడిన వారికి సభలో ఉండే అర్హత లేదు. దమ్ము లేకనే బాబు పారిపోయాడు: మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోయింది. ఆ పార్టీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌కు పైత్యం పుట్టుకొచ్చింది. దమ్ములేకనే మీ నాయకుడు చంద్రబాబు సభ నుంచి పారిపోయాడు. బయట చంద్రబాబు, సభలో టీడీపీ సభ్యులు అసత్యాలతో ప్రభుత్వంపైన, సీఎంపైన బురద జల్లుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచినట్టు అంగీకరిస్తే కేశవ్‌ను, లేకుంటే ఈనాడులో అసత్యాలు ప్రచురించినందుకు రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలి. రాష్ట్రానికి శని ఎల్లో మీడియా: మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట్రానికి ఎల్లో మీడియా శనిలా పట్టుకుంది. పూర్తి అసత్యాలతో కూడిన పేపర్లు నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. అటువంటి సంస్థలను కచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా ఈనాడులో రాతలు రాసిన రామోజీరావును తీసుకొచ్చి సభలో నిలబెట్టాలి. బీసీలంటే బాబుకు అలుసు: మంత్రి అప్పలరాజు ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు సభలో ఉండి కూడా మిమ్మల్ని(స్పీకర్) చైర్లో కూర్చోబెట్టడానికి రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ సభ్యుడు దమ్ముందా అంటూ చైర్ పట్ల దురుసు ప్రవర్తన కూడా బీసీలను కించపరిచేలా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వం, సీఎంను అవమానించేలా మాట్లాడిన కేశవ్‌ను ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలి. కేశవ్ ప్రవర్తనను సభ ఖండిస్తోంది: మంత్రి చెల్లుబోయిన వేణు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దురుసు ప్రవర్తనను సభ మొత్తం ఖండిస్తోంది. సభా వ్యవహారాల్లో అధికార పక్షం సమన్వయం పాటిస్తూ, ప్రజలకు మేలు చేసే అంశాలను ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. సభా మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బొత్స రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం దారుణం. ఇటువంటి తప్పు కేశవ్ చేసినా, ఈనాడు పేపర్ చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. -
సంక్షేమం తోడుగా 'అభివృద్ధి'
కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. – గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ సాక్షి, అమరావతి: సమాజంలో ఏ ఒక్కరూ వెనుక పడకూడదనే లక్ష్యంతో నవరత్నాలనే గొడుగు కింద సమ్మిళిత పాలన నమూనాతో సంక్షేమ వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అన్ని వర్గాల వారి అభ్యున్నతే లక్ష్యంగా, రాష్ట్ర సుస్థిర ప్రగతే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. 2023–24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో గడిచిన 45 నెలల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు రూ.1.97 లక్షల కోట్ల మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ క్రియాశీల నాయకత్వంలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో నాలుగేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ క్రమంలో సమర్థవంతమైన ప్రభుత్వ విధానాల అమలుతో 2021–22లో 11.43 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించామన్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధికం అని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామన్నారు. 15,004 సచివాలయాల ద్వారా పాలనలో పారదర్శకత, వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించామని చెప్పారు. 2022–23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలలో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ధరలలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22లో రూ.1,92,517 నుంచి 14.02 శాతం ప్రోత్సాహక వృద్ధిరేటుతో రూ.2,19,518కు చేరిందన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ఇంకా ఏమన్నారంటే.. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్ విద్యా సంస్కరణలతో బంగారు బాట ► 2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠ్యప్రణాళిక సంస్కరణలను అమలు చేస్తున్నాం. 2020–21 నుంచి మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రూ.3,669 కోట్లతో తొలి దశలో 15,717 పాఠశాలలను, రెండో దశ కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాం. మూడేళ్లలో రూ.16,021.67 కోట్లతో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది మా ప్రభుత్వ యోచన. ► ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద 84 లక్షల మంది పిల్లలను పాఠశాలలకు పంపడానికి 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల మొత్తాన్ని అందించాం. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. ► రూ.690 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ ప్రీలోడ్ చేసిన ట్యాబ్‌లను 4.60 లక్షల మంది విద్యార్థులు, 60 వేల మంది టీచర్లకు పంపిణీ చేశాం. ఆరో తరగతి, ఆపై తరగతుల వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ఈ ప్యానెల్స్‌ను 5,800 పాఠశాలల్లోని 30,213 తరగతి గదుల్లో నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇంగ్లిష్ మీడియం అమలు చేయడంతో పాటు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. ► స్కూల్ డ్రాపౌట్స్‌ను తగ్గించి జీఈఆర్‌ను మెరుగు పరచడానికి జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు బూట్లు, బ్యాగ్‌లు, పుస్తకాలు, ఇతర వస్తువులతో కూడిన కిట్ల పంపిణీకి 2020–21 నుంచి రూ.2,368 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశాం. ఆరోగ్యకరమైన సమాజం ► డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 2,446 నుంచి 3,255కు పెంపు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు (95 శాతం కుటుంబాలు) వర్తింపు ► ఆరోగ్య ఆసరా కింద 15.65 లక్షల మందికి రూ.971.28 కోట్ల సాయం ► రాష్ట్రంలో సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ సేవల అమలు ► గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ► వైఎస్సార్ టెలిమెడిసిన్ కింద 2.83 కోట్ల కన్సల్టెన్సీల నమోదు. ఇది దేశంలో 35 శాతం వాటా ► నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి. 17 వైద్య కళాశాలల ఏర్పాటు. వచ్చే విద్యా సంవత్సరంలో 5 కళాశాలలు ప్రారంభం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 పోస్టుల భర్తీ సామాజిక భద్రతలో విప్లవం ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా 35.7 లక్షల మంది గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, పిల్లల పోషకాహారం కోసం రూ.6,141 కోట్ల ఖర్చు ► నవ రత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.65 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు.. వీరిలో 21.25 లక్షల మందికి గృహాల మంజూరు. 4.4 లక్షల గృహాల నిర్మాణం పూర్తి. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్ల ఖర్చు ► వైఎస్సార్ పింఛన్ కానుక కింద 64.45 లక్షల మందికి రూ.66,823.79 కోట్లు . ► వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.788.5 కోట్ల సాయం ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద .20 లక్షల మందికి రూ.422 కోట్లు ► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.927.49 కోట్లు ► వైఎస్సార్ బీమా కింద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు రెండేళ్లలో రూ.512 కోట్లు ► వైఎస్సార్ వాహనమిత్ర కింద 2.74 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,041 కోట్ల సాయం ► వైఎస్సార్ లా నేస్తం ద్వారా 4,248 మంది జూనియర్ లాయర్లకు రూ.35.4 కోట్లు ► జగనన్న తోడు కింద 15.31 లక్షల వీధి వ్యాపారులకు రూ.2,470.3 కోట్ల మేర సాయం ► స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం. అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► 2019 ఏప్రిల్ 11 నాటికి 78.74 లక్షల మంది ఎస్ఎస్జీ మహిళలు బ్యాంక్‌లకు బకాయిపడ్డ రుణ మొత్తంలో రూ.12,758 కోట్లు చెల్లింపు ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 1.02 కోట్ల మంది ఎస్‌హెచ్‌జి మహిళలకు రూ.3,615 కోట్ల సాయం ► వైఎస్సార్ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 26.7 లక్షల మందికి మూడు విడతల్లో రూ.14,129 కోట్ల చెల్లింపు ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద మూడు విడతల్లో 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్లు ► వైఎస్సార్ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు ► వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్ప సంఖ్యాక వరాల్లోని యువతుల పెళ్లికి ఆర్థిక సాయం ►వైఎస్సార్ స్వేచ్ఛ పథకం కింద రూ.25.33 కోట్ల ఖర్చు ► ఆపదలో ఉన్న మహిళలను రక్షించేలా దిశ యాప్. 1.36 కోట్ల డౌన్లోడ్లు ► 2021–22 నుంచి ‘జెండర్’ బడ్జెట్ సుస్థిర వ్యవసాయానికి భరోసా సుస్థిర వ్యవసాయానికి భరోసా ► 2020–21లో వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశు సంవర్థక రంగంలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం వృద్ధి రేటు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుపరిపాలన సూచికలో (జీజీఐ) మొదటి స్థానం. ► వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఐదేళ్లలో రూ.67,500 కోట్లు. 10,778 రైతు భరోసా కేంద్రాలు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 44.55 లక్షల మంది రైతులకు రూ.6,872 కోట్ల బీమా చెల్లింపు. ► 147 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, జోనల్ స్థాయిలో 4 రీజనల్ కోడింగ్ కేంద్రాల ఏర్పాటు. 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ. 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. శీతలు గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, రూ.27,800 కోట్ల విలువైన ఉచిత విద్యుత్. 10 ఎకరాల లోపు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,647 కోట్లు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలకు పెంపు. దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బెస్ట్ ► పరిశ్రమల స్థాపన, నిర్వహణ కోసం 21 రోజుల్లో సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా అన్ని అనుమతుల మంజూరు. ఇతరత్రా సహకారం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్ల పాటు వరుసగా ఏపీకి మొదటి స్థానం. ► ఈ నెల 3, 4 తేదీలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహణ. రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 378 అవగాహన ఒప్పందాలు. 16 కీలక రంగాల్లో 6 లక్షల ఉద్యోగావకాశాలు. రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళిక. రాష్ట్రంలో కొత్తగా 69 భారీ, మెగా పరిశ్రమలు. ► వైఎస్సార్ నవోదయం కింద ఎంఎస్ఎంఈల బలోపేతానికి తోడ్పాటు. రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల యూనిట్లు. 13.63 లక్షల మందికి ఉపాధి. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కింద 23,236 ఎంఎస్ఎంఈలకు రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు. ► ఏపీ లాజిస్టిక్ హబ్‌గా, ఆగ్నేయ ఆసియాకు గేట్వేగా రాష్ట్రం. 6 నిర్వాహక ఓడరేవులు ఉండగా, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నంలో కొత్తగా ఏర్పాటు. రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం. వైజాగ్– చెన్నై, చెన్నై– బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి. -
పాడి, ఉద్యాన రంగాలకు ఊతం
సాక్షి, అమరావతి : ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తృణ, చిరుధాన్యాల పంటల సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉద్యానవన, పశుగణ, మత్స్య రంగాలు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నడిపించే వృద్ధి చోదకాలుగా గుర్తించి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాట, కొబ్బరి, మిరప పంటల ఉత్పాదకతలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2023-24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ♦ భారతదేశంలో మామిడి, కమల, పసుపు ఉత్పత్తిలో రాష్టం 2వ స్థానంలో, సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్ ఇరిగేషన్) అమలులో 3వ స్థానంలో నిలిచింది. ♦ దేశంలోనే ఏడాదికి గుడ్ల ఉత్పత్తిలో 2,645 కోట్ల గుడ్లతో ప్రథమ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 10.26 లక్షల టన్నులతో రెండవ స్థానంలో, పాల ఉత్పత్తిలో 154.03 లక్షల టన్నులతో 5వ స్థానంలో ఉంది. ♦ పశు ఆరోగ్య రక్షణలో భాగంగా 1962కు ఫోన్ చేయగానే పాడి రైతు వద్దకు వచ్చేలా రూ.252.91 కోట్ల వ్యయంతో 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏర్పాటు చేసింది. ♦ పాల సహకార సంఘాల బలోపేతానికి అమూల్ ప్రాజెక్ట్‌కు ఎన్సీడీసీ ద్వారా పాడి పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి రుణంగా రూ.1,362 కోట్లు అందించింది. ♦ రూ.1,868.63 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 45-56 సంవత్సరాల మధ్య వయసున్న 2.49 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ♦ జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ.20,020 కోట్లు (35 శాతం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాగా ఉంది. రాష్ట్రం పచ్చతోరణం రాష్ట్రంలో 26 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం పని చేస్తోంది. జగనన్న పచ్చ తోరణం కింద 2022-23లో 3.05 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఐఎస్ఎఫ్ఆర్-2021 (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్) నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 646.9 చ.కి.మీ మేరకు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు 2023-24లో రాష్ట్రంలోని 23 ప్రదేశాలలో నగరవనాలు/దేవాలయ ఎకో పార్కులను అభివృద్ధి చేయనుంది. స్వచ్ఛ భారత్ సంకల్పానికి నిదర్శనం ♦ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ కోసం 2022-23లో రూ.220.82 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో 70 శాతం మేర ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.417.76 కోట్లతో ప్రతి మండలంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ♦ ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖ, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. ♦ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘క్లీనెస్ట్ స్టేట్/నేషనల్ క్యాపిటల్’ అవార్డు, 10-40 లక్షల జనాభా కేటగిరిలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’ అవార్డు, సౌత్ జోన్ (50,000 నుండి ఒక లక్ష జనాభా) కేటగిరీలో పులివెందులకు ‘ఇన్నోవేషన్ - బెస్ట్ ప్రాక్టీసెస్’ కింద అవార్డులు లభించాయి. మిలియన్ ప్లస్ సిటి కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ సిటీగా నిలిచింది. ఉపాధి నైపుణ్యాల పెంపు ♦ ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఉపాధి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్టు, 3.72 లక్షల అవుట్సోర్సింగ్/ఇతర ఉద్యోగాలు కలిపి మొత్తం 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించింది. ♦ అవుట్ సోర్సింగ్/ గౌరవ వేతన ఆధారిత ఉద్యోగుల జీతాలు పెంచి, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్‌ను అందిస్తోంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 దశలలో వైఎస్సార్ బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను నెలకొల్పనుంది. నేరుగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ♦ విద్యుత్ రంగంలో.. విద్యుత్ ఖర్చును తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీఐతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్ల పనులను పూర్తి చేసింది. ♦ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించి పారదర్శకంగా నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందిస్తోంది. డీబీటీ విధానం ద్వారా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రీ సర్వే అద్భుతం 17,584 గ్రామాల్లో సమగ్ర రీ సర్వేను చేపట్టిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 2000 గ్రామాల్లో 4,38,899 మంది ఆస్తి యజమానులకు ‘శాశ్వత భూ హక్కు పత్రాలు’ పంపిణీ అయ్యాయి. ఈ విషయమై నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలు అందుకుంది. రాజకీయ సాధికారతో సామాజిక న్యాయం ♦ మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం పదవులను, రెండో విడతలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో (80 శాతం) నాలుగు పోస్టులను వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. ♦ 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో తొమ్మిదింటిని (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ్ చట్టం చేశాం. ఇందులో భాగంగా 137 వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో (58 శాతం) వీరినే కూర్చోబెట్టాం. ♦ 56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వెనుబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. ‘జగజ్జీవన జ్యోతి’ పథకం కింద 15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో.. ♦ వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్యను 26కు, రెవెన్యూ డివిజన్లు 76కు, పోలీసు డివిజన్లను 108కి పెంచాం. 1956 తర్వాత తొలిసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ♦ ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికి నీతి ఆయోగ్ ప్రసంశలు లభించాయి. ♦ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సచివాలయ స్థాయిలో పరిష్కరించడానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. ♦ 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నాం. ♦ నేరాల నియంత్రణలో భాగంగా తీసుకున్న వినూత్న పోలీసింగ్ చర్యలు శాంతియుత వాతావరణానికి దోహదపడ్డాయి. మహిళల భద్రత, రక్షణకు దిశ బిల్లు తెచ్చాం. ♦ రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాం. ♦ రాష్ట్రం ఎగుమతుల్లో 2019-20లో 7వ ర్యాంకులో ఉంది. 2020-21 నాటికి 16.08 బిలియన్ డాలర్లతో నాల్గవ ర్యాంకుకు చేరుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జాతీయ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను అందిస్తోంది. దీనిని 2030 నాటికి 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ♦ రూ.4,994 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రోడ్లు ప్రాజెక్టు చేపట్టాం. గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ. 502 కోట్ల వ్యయంతో 992 కిలోమీటర్ల తారు రోడ్లు వేశాం. ఈ ఏడాది 1,236 కిలోమీటర్లు మేర 174 రోడ్లను, 21 వంతెనలను పూర్తి చేయనున్నాం. ♦ రూ.2,173 కోట్ల వ్యయంతో 5,181 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు ప్రభుత్వం చేపట్టింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో రూ.3,013 కోట్ల అంచనా వ్యయంతో 1,260 కిలోమీటర్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి. ♦ దేశంలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో గ్రామాల్లో రీసర్వే చేస్తోంది. -
Budget Session 2023-24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తొలి రోజు దృశ్యాలు
-
ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, అమరావతి: అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా 11.43 శాతం గ్రోత్ రేటును సాధించామని, ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిసారి గవర్నర్ ప్రసంగించారు. అవినీతికి తావులేకుండా తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ‘GSDPలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. DBT ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. రూ. 3,669 కోట్లతో పాఠశాలలను ఆధునికరిస్తున్నాం. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోని యువత ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చాం. విద్యా సంస్కరణలు అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19, 617.60 కోట్లు ఆర్థిక సాయం. విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్. విద్యార్థులకు రూ. 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ. జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీడిజైన్. మండలంలో కనీసం 2 జూ.. కళాశాలలు ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైన రాష్ట్రం ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కళాశాలల ఏర్పాటు. జగనన్న గోరుముద్దతో ఇప్పటి వరకు. రూ.3,239 కోట్లు ఖర్చుతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీవెన కింద 24.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 9,249 కోట్లు చెల్లించాం. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం..రూ. 20 వేలు చెల్లిస్తున్నాం. ఈ పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు 3,366 కోట్లు పంపిణీ చేశాం. ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ కడపలో డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ. రాష్ట్రంలో కొత్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. విజయనగరంలో జేఎన్టీయూ-గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. కర్నూలులో కస్టర్ యూనివర్సిటీ. ఉన్నత విద్య కోసం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు. పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు. రూ. 971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక. ప్రతి నెల 64.45 లక్షల మందికి రూ. 66,823.79 కోట్లు పెన్షన్ల పంపిణీ. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు. 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ. రూ. 971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు. జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ.927,49 కోట్లు పంపిణీ. ప్రజల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్. జగనన్న తోడు పథకం కింద సున్నా వడ్డీకి 15.31 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,470.3 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ వాహనమిత్ర కింద 2.74 లక్షల మందికి రూ. 1,041 కోట్లు. వైఎస్సార్ చేయూత కింద ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 3 విడతల్లో రూ. 14,129 కోట్ల పంపిణీ. 78.74 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు రెండు విడతలుగా రూ. 12,758 కోట్లు విడుదల. రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు స్థానిక సంస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. నామినేట్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రారంభించాం. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు. రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు. ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు. 137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. 15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజ వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. -
సీఎం జగన్ నాయకత్వంలో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ ఆధారిత అభివృద్ధి, వృద్ధిరేటు పెరుగుదల రానున్న రోజుల్లోనూ ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ విధానంలో రూ.1.82 లక్షల కోట్లను పారదర్శకంగా పంపిణీ చేసిందని తనకు తెలిసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారని ప్రశంసించారు. ప్రభుత్వ సేవలు, పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి ప్రభుత్వం వినూత్న సంస్కరణలను తెచ్చిందని అభినందించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్‌లోనే అన్ని వృద్ధి సూచీల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఏపీది గొప్ప సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం గొప్ప సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఏపీకి ఉంది. గవర్నర్‌గా సేవ చేసే అవకాశం దక్కినందుకు గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. నా సొంత రాష్ట్రం కర్ణాటక.. ఏపీతో ఎన్నో అంశాల్లో అవినాభావ సంబంధం కలిగి ఉంది. భౌగోళికంగా పక్కపక్కనే ఉండటంతోపాటు రెండు రాష్ట్రాలు ప్రధానంగా వ్యవసాయాధారితమైనవి. తెలుగు భాష పట్ల అవ్యాజ్యమైన మక్కువ కలిగిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భోజుడుగా వాసికెక్కారు. ఎంతోమంది తెలుగు ప్రముఖులను ఆయన తన సామ్రాజ్యంలో కీలక స్థానాల్లో నిలిపారు. అంతేకాకుండా తన ఆస్థానంలో కవులుగా స్థానం కల్పించారు. స్వాతంత్య్రోద్యమంలో ఏపీ కీలక భూమిక.. మహాత్మాగాంధీ పిలుపును అందుకుని స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించింది. చీరాల–పేరాల ఉద్యమం, అల్లూరి సీతారామరాజు నిర్వహించిన రంపా తిరుగుబాటు ఏపీలో కీలక ఘట్టాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో తెలుగు ప్రజల చిరకాల డిమాండ్ అయిన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఘనమైన సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వ సంపద కలిగిన ప్రముఖ దేవాలయాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకులు, భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. అపార ఖనిజ సంపదకు నిలయం బొగ్గు, లైమ్‌స్టోన్, బాక్సైట్ తదితర అపార ఖనిజాలకు ఏపీ నిలయం. గోదావరి, కృష్ణా, పెన్నా పరివాహక ప్రదేశాలతో, సారవంతమైన భూములతో పటిష్ట సాగునీటి వ్యవస్థను కలిగి ఉంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్ర రాష్ట్రంగా గుర్తింపు పొందింది. దేశ తూర్పుతీరంలో అత్యధికంగా 974 కి.మీ.తీరరేఖను కలిగి ఉంది. మూడు కేంద్రీయ, 4 డీమ్డ్, 5 ప్రైవేటు, 25 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 20 అటానమస్ విద్యా సంస్థలతో ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది. కాగా రాష్ట్రం గురించి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ముగించారు. -
రిటైరైన జస్టిస్ నజీర్
న్యూఢిల్లీ: జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్ నజీర్‌ది బహుముఖీన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్ నజీర్ అన్నారు. జూనియర్ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు. -
ఇద్దర్ని బలిగొన్న లారీ
ఆలేరు మండల కేంద్రానికి సమీపంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను హైదరాబాద్ కి చెందిన ఖదీర్(58), అబ్దుల్ నజీర్(37)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి వరంగల్ కారులో బయలుదేరగా..మార్గమధ్యంలో టైరు పంక్చరైంది. రోడ్డు పక్కన కారుకు మరమ్మతులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెలుతురు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘట నాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.