అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి | Andhra Pradesh Governor S Abdul Nazeer launches Viksit Bharat Sankalp Yatra (Urban) in Vijayawada | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

Published Fri, Dec 8 2023 5:07 AM | Last Updated on Fri, Dec 8 2023 10:40 AM

Andhra Pradesh Governor S Abdul Nazeer launches Viksit Bharat Sankalp Yatra (Urban) in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌  మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్‌ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు  సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు,  విజయవాడ మేయర్‌ ఆర్‌.భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, కలెక్టర్‌ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement