
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
శంషాబాద్: కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో కూడా అలర్ట్ విధించారు.
ఆక్టోపస్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించారు. విమానాశ్రయంలోని ప్రధాన రహదారితో పాటు అన్ని రోటరీల వద్ద బలగాలను మోహరించారు. డాగ్‌స్క్వాడ్‌లతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు.