
న్యూఢిల్లీ: జవాన్ల కుటుంబాల కోసం ప్రజలు ఇప్పటి వరకు రూ.7 కోట్ల సాయం ప్రకటించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ ‘భారత్ కే వీర్’ ద్వారా ఈ విరాళాలు పోగయ్యాయి. ‘కొన్ని నకిలీ సంస్థలు కూడా సాయుధ దళాలకు సాయం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉండండి. భారత్ కే వీర్ మాత్రమే విరాళం ఇవ్వండి’ అని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రజలను కోరారు.
షిర్డీ ట్రస్టు సాయం 2.51 కోట్లు
సాక్షి ముంబై: అమరుల కుటుంబీకులకు రూ. 2.51 కోట్ల సాయం చేస్తామని షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ సురేశ్ హావరే చెప్పారు. ఇప్పటికే ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధి వినాయక ఆలయ ట్రస్టు రూ. 50 లక్షల సాయం ప్రకటించింది. ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు.