హోరాహోరీగా కాల్పులు.. 12 మంది హతం | 12 militants killed in Pakistan clash | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా కాల్పులు.. 12 మంది హతం

Published Tue, Feb 23 2016 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

12 militants killed in Pakistan clash

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ పోలీసులు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 12 మంది హతమయ్యారని కరాచీ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, వారికి ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నట్లు చెప్పారు. కరాచీలో మిలిటెంట్లు దాగిఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచారు.

ఎదురుకాల్పుల్లో 8 మంది, పారిపోయే యత్రం చేస్తున్న సమయంలో జరిపిన కాల్పుల్లో మరో నలుగురు హతమయ్యారని సీనియర్ పోలీస్ వివరించారు. మిలిటెంట్లు లష్కర్ ఈ ఝాంగ్వీ, తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ గ్రూపు వ్యక్తులని అధికారులు భావిస్తున్నారు. మిలిటెంట్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement