డ్రోన్ కెమెరాలు వాడొద్దంటూ హెచ్చరిక..! | Afghanistan government bans media's use of drone cameras | Sakshi
Sakshi News home page

డ్రోన్ కెమెరాలు వాడొద్దంటూ హెచ్చరిక..!

Published Thu, Jun 9 2016 11:08 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

డ్రోన్ కెమెరాలు వాడొద్దంటూ హెచ్చరిక..! - Sakshi

డ్రోన్ కెమెరాలు వాడొద్దంటూ హెచ్చరిక..!

కాబూల్: మీడియా సంస్థలు ఇకనుంచి డ్రోన్ కెమెరాలను వాడరాదని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు. వాటిపై నిషేధం విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశ భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు డ్రోన్ కెమెరాలు వినియోగించవద్దని హాం మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల కాబూల్ లో అధ్యక్ష భవనం వద్ద ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన నిరసనను లోకల్ మీడియా డ్రోన్ కెమెరాల సాయంతో అక్కడ జరిగిన దృశ్యాలను వీడియో తీసింది. వీటితో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు, అమెరికా సేనలు కూడా డ్రోన్లు వాడతాయని, వీటి వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. గత నెలలో పాకిస్తాన్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాలిబాన్ అగ్రనేత మన్సూర్ మృతి చెందిన విషయం తెలిసిందే.

తాలిబాన్ ఉగ్రసంస్థలతో పాటు విదేశీ బలగాలు, దేశీయ మీడియా సంస్థలు డ్రోన్లు వాడుతున్నాయని ఈ నేపథ్యంలో దాడులు లాంటి ఘటనలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు, అధికారులను టార్గెట్ చేస్తూ డ్రోన్ కెమెరాల సాయంతో దాడులు జరిగి అవకాశాలున్నాయని ఓ అధికారి వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement