వీసా లేకుండా తమ దేశంలో పర్యటించే ప్రక్రియను అమెరికా కట్టుదిట్టం చేసింది. పారిస్ తరహా దాడులు అమెరికాలోనూ జరగవచ్చన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. 'వీసా రహిత కార్యక్రమం'(వీడబ్ల్యూపీ) కింద 38 దేశాలవారు వీసా లేకుండానే అమెరికాలో 90 రోజులపాటు పర్యటించవచ్చు. అయితే ఈ విధానం వల్ల ఉగ్రవాదులు తప్పుడు పాస్‌పోర్టులతో తమ దేశంలోకి చొరబడే అవకాశం ఉందని భావించిన అమెరికా నిబంధనలను కఠినతరం చేసింది. భారత్ వీడబ్ల్యూపీ జాబితాలో లేనప్పటికీ... తాజా నిబంధనలతో అమెరికా వీసా పొందటం మరింత కఠినతరమవుతుంది.