ఆరుగురు కరడుగట్టిన ఉగ్రవాదులతో ఢిల్లీపైకి..
న్యూఢిల్లీ: దేశమంతా హోలీ సంబురాల్లో ఉండగా పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు మరోసారి కుట్రపన్నారు. ఆరుగురు కరడుగట్టిన ఉగ్రవాదులతో పాకిస్థాన్కు చెందిన ఓ మాజీ ఆర్మీ అధికారి భారత్ సరిహద్దు దాటినట్లు ఢిల్లీ, పంజాబ్, అసోం పోలీసు వర్గాలకు సమాచారం అందింది. దీంతో దేశ వ్యాప్తంగా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
ఢిల్లీలో దాడులకు పాల్పడేందుకు వీరు వ్యూహరచన చేసినట్లు హెచ్చరించాయి. గతంలో దాడులకు పాల్పడిన పఠాన్ కోట్ ప్రాంతంలో ఇండియా-పాక్ సరిహద్దు నుంచే వారు దేశంలోకి చొరబడ్డారని స్పష్టం చేశారు.