మార్కెట్‌లో బాంబు పేలి 23 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శివారులోని ఓ కూరగాయల మార్కెట్ ఉగ్రవాదుల దాడిలో నెత్తురోడింది. కూరగాయలు, పండ్లు విక్రయించే ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో బుధవారం 23 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. రావల్పిండి సైనిక స్థావరం సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వీసీ ప్రొఫెసర్ జావేద్ అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదులు జామ కాయల బుట్టలో 5 కిలోల పేలుడు పదార్థాలను అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడుకు తామే కారణమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.
బూత్‌లలో పార్టీల టోపీలపై నిషేధం
న్యూఢిల్లీ: పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లలో రాజకీయ పార్టీల పేర్లు, గుర్తులు, నినాదాలు ఉన్న టోపీలు, శాలువాలు, ఇతర వస్త్రాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ప్రజలు వీటితో బూత్‌లలోకి ప్రవేశించకూడదని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 130వ సెక్షన్‌ను ఉటంకిస్తూ బుధవారం తెలిపింది. కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
ఇస్లామాబాద్‌లో ఉగ్ర దాడి
Published Thu, Apr 10 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement
Advertisement