Institute of Medical Sciences
-
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
ప్రజా వైద్యానికి.. రూ.10,000 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నడూలేని విధంగా 2021 సంవత్సరంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఒకేసారి ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో రానున్న 2022–23 సంవత్సరంలో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలుంటే, అంతేమొత్తంలో కొత్త కాలేజీలు రావడం విప్లవాత్మక నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,840 అవుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఎయిమ్స్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలన్నది సర్కారు సంకల్పం. అలాగే వరంగల్లోనూ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్‌గా మారుతుందని అంటున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చే రెండేళ్లలో అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం’ అని సర్కారు చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
ఇస్లామాబాద్‌లో ఉగ్ర దాడి
మార్కెట్లో బాంబు పేలి 23 మంది మృతి ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శివారులోని ఓ కూరగాయల మార్కెట్ ఉగ్రవాదుల దాడిలో నెత్తురోడింది. కూరగాయలు, పండ్లు విక్రయించే ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకుని ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో బుధవారం 23 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. రావల్పిండి సైనిక స్థావరం సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వీసీ ప్రొఫెసర్ జావేద్ అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదులు జామ కాయల బుట్టలో 5 కిలోల పేలుడు పదార్థాలను అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడుకు తామే కారణమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. బూత్‌లలో పార్టీల టోపీలపై నిషేధం న్యూఢిల్లీ: పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లలో రాజకీయ పార్టీల పేర్లు, గుర్తులు, నినాదాలు ఉన్న టోపీలు, శాలువాలు, ఇతర వస్త్రాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ప్రజలు వీటితో బూత్‌లలోకి ప్రవేశించకూడదని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 130వ సెక్షన్‌ను ఉటంకిస్తూ బుధవారం తెలిపింది. కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. -
రిమ్స్‌లో ఉద్యోగులు గీ +డీడీ
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఆస్పత్రి వివాదాలతో హోరెత్తిపోతోంది. ఒక సమస్య సమసిందనేసరికి కొత్త వివాదం పుట్టుకొస్తోంది. ఫలితంగా వైద్య సేవలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా రిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ సృజన, గెజిటెడ్ ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆమె తీరు పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిష్కరించకుంటే మున్ముందు వివాదం పెరిగి పెద్దదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదీ సంగతి డీడీ సృజన వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోందని ఆస్పత్రి వర్గాలు వివరించాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగాంగా ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నప్పుడు డీడీ మాత్రం విధులకు హాజరయ్యేవారు. అంతటి తో ఆగకుండా సిబ్బంది కూడా హాజరుకావాలని, లేకుంటే బాగోదని బెదిరించేవారు. దీంతో అప్పట్లో ఆమెకు, ఎన్జీవోలకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సమ్మె సమయంలోనే ఆమె కొన్ని కంప్యూటర్లను గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేయటంపై వివాదం రేగింది. తర్వాత కొన్నాళ్లు బానే ఉన్న ఆమె రెండు నెలలుగా వైద్యు లు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. రోజూ వైద్యులు ఉదయం 8.30 గంటలకు విధులకు హాజరవుతారు. డీడీ 10.30 గంటల సమయంలో వస్తారు. అప్పుడు వైద్యులు తన వద్దకొచ్చి హాజరు పట్టికలో సంతకం పెట్టాలని ఆమె హుకుం జారీ చేశారు. వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో ఊరుకున్నారు. ఫిజియో థెరపిస్టును మాత్రం పిలిపించి ఆ విభాగాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నానని, రోజూ తన వద్దకువచ్చి సంతకం పెట్టాలని ఆదేశించారు. అందుకు ఆయన నిరాకరించటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు తాజాగా గెజిటెడ్ అధికారులైన ఫిజియోథెరపిస్టు, ముగ్గురు నర్సింగ్ సూపరింటెండెంట్ లు, బయోకెమిస్ట్రీ వైద్యాధికారులపై పెత్తనం చేసేందుకు యత్నాలు మొదలుపెట్టారు. రోజు తనవద్దకొచ్చి సంతకం పెట్టాలని మళ్లీ ఆదేశించారు. తాము ఉదయం త్వరగా విధులకు వస్తామని, మీరు వచ్చేసరికి విధుల్లో బిజీగా ఉంటామని, అందువల్ల రావటం కుదరదని వీరిలో ఒకరు డీడీకి తెలియజేశారు. అదంతా తనకు తెలియదని కచ్చితంగా వచ్చి తీరాలని పేర్కొంటూ ఫిజియోథెరపిస్టు డాక్టర్ లక్ష్మణరావు వద్దకు సోమవారం సర్క్యులర్ పంపారు. అయితే దీనిని ఆయన తిరస్కరించారు. మరి బయోమెట్రిక్ విధానం ఎందుకు? వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూసేందుకుగాను బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. అలాంటపుడు డీడీ తన వద్దకు వచ్చి సంతకాలు పెట్టమనటం ఎంతవరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. విధులను మధ్యలో నిలుపుదల చేసి సంతకం పెట్టడానికి వెళ్తే రోగులు ఇబ్బందులు పడతారని అంటున్నారు. డీడీ తీరు మారకుంటే విధుల బహిష్కరణ చేపట్టకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ వద్ద ప్రస్తావించగా తన వద్దకు వచ్చి సంతకాలు పెట్టాలంటూ డీడీ ఎలాంటి సర్క్యులర్ పంపలేదని, కేవలం హాజరుపట్టికను మాత్రమే పంపాలని వైద్యులకు చెప్పారని పేర్కొన్నారు.