
న్యూఢిల్లీ : భారత్‌పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం హెచ్చరించారు. దేశంలోని మారుమూల ప్రదేశాల్లో భద్రత లోపించిందని, ఉడి తరహా ఉగ్రదాడి మరోమారు జరగుతుందనే ఇంటిలిజెన్స్ సమాచారం వచ్చినట్లు చెప్పారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడం, ఇంటిలిజెన్స్ గ్రూప్‌ను బలపరచడం, భారత ఆర్మీని దుర్భేద్యంగా సాధ్యమైనంత త్వరగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ బలపడాలని అన్నారు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ను వినియోగించే యోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు. కాగా, గతేడాది ఉడి ఉగ్రదాడి అనంతరం.. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రావత్ అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని కూడా చెప్పారు.