న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది రిటైర్మెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర అడుగులేస్తోంది. ఈ మేరకు నూతన త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్లతో పాటు వైమానిక దళంలో ఎయిర్ మెన్, నేవీలో సెయిలర్ల పదవీ విరమణ వయసును కూడా 50 సంవత్సరాలకు పెంచునున్నట్లు తెలిపారు. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్‌లు అక్కడినుంచే..!
త్రివిధ దళాల్లో ఉన్న జవాన్ల రిటైర్మెంట్ వయసు పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకున్నట్లు రానున్నట్లు బిపిన్ రావత్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సుమారు 15 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న జవాన్లు, ఎయిర్ మెన్, సెయిలర్లు 15 నుంచి 17 ఏళ్ల మాత్రమే సర్వీసులో ఉంటున్నారు. చదవండి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో
దీనిపై బిపిన్ రావత్ స్పందిస్తూ.. అన్ని విధాల ట్రైనింగ్ పొందిన వారు కేవలం 15 నుంచి 17 ఏళ్లు మాత్రమే ఎందుకు సర్వీస్‌లో ఉండాలి, 30 సంత్సరాలపాటు వారెందుకు సేవ చేయకూడదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్రం తీసుకోబోయే నిర్ణయానికి సంకేతంగా భావిస్తున్నారు. చదవండి: ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment