న్యూఢిల్లీ: నియంత్రణరేఖ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని.. అది ఎప్పుడైనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. దేశం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బుధవారం ఆయన తెలిపారు. ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నియంత్రణ రేఖ వెంట పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి’ అని రావత్ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంట సుమారు 950 కాల్పుల ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి గత నెలలో లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment