retaliatory attack
-
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
‘నియంత్రణ రేఖ’ ఉద్రిక్తంగా మారుతోంది
న్యూఢిల్లీ: నియంత్రణరేఖ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని.. అది ఎప్పుడైనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. దేశం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బుధవారం ఆయన తెలిపారు. ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ-కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నియంత్రణ రేఖ వెంట పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి’ అని రావత్ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జమ్మూ కశ్మీర్లోని నియంత్రణరేఖ వెంట సుమారు 950 కాల్పుల ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి గత నెలలో లోక్సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాటేసిన పామును కొరికి చంపేశాడు
‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు..కుక్కను మనిషి కరిస్తే వార్త’ అంటూ సాధారణంగా జర్నలిజం నేర్చుకునే విద్యార్థులకు చెబుతారు. వార్త ప్రాధాన్యత, ప్రాముఖ్యతను గురించి తెలియ చెప్పటానికి ఈ నానుడి బాగా ఉపయోగపడుతుంది. అయితే గుజరాత్లో దాదాపు ఇలాంటి వింత విషయం ఒకటి చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న ఓ పెద్దాయనను పాము కాటేసింది. దానిపై పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో..తెలియదుగానీ..తనను కాటేసిన పామును పట్టుకుని పరపర కొరికి పారేశాడు. అయితే ఆ పాము బాగా విషపూరితమైంది కావడంతో దురదృష్ట వశాత్తూ ఆయన కూడా చనిపోయారు. మాహిసాగర్ జిల్లా అజన్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పర్వత్ గాలా బారియా (70) తన వ్యవసాయం క్షేత్రంలోని మొక్కజొన్న పంటను ట్రక్కులో లోడ్ చేస్తున్న ప్రదేశంలోకి ఒక పాము వచ్చింది. దాన్ని చూసిన అక్కడి వారందరూ పారిపోయారు. కానీ అంతకుముందు కూడా పాములను పట్టుకున్న అనుభవం వున్న పర్వత్ అక్కడే వుండిపోయారు. కానీ పాము కాటు నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. చేతులమీద, ముఖం మీద కాటు వేసింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పర్వత్ పామును దొరకబుచ్చుకుని కొరికి చంపేశాడని అజన్వా సర్పంచ్ కనుబరియా చెప్పారు. వెంటనే ఆయన్ను లూనావాడా ఆసుపత్రికి ఆ తరువాత గోద్రాలోని పెద్దాసుపత్రికి తరలించాం.. కానీ సకాలంలో మెరుగైన వైద్యం అందకపోవడం, విషం శరీరమంతా వ్యాపించడంతో పర్వత్ ప్రాణాలు విడిచాడని సర్పంచ్ చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. -
నడి రోడ్డుపై నరికేశారు..
పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరంలో శుక్రవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. రౌడీషీటర్ బైసాని రామకృష్ణపై ప్రత్యర్ధి వర్గం విరుచుకుపడింది. ప్రతీకార దాడిలో కత్తులతో రామకృష్ణను వెంబడించిన ప్రత్యర్ధులు వన్ టౌన్ లో నరికి చంపారు. స్ధానికుల సమాచారంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.