USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్‌ పాత వీడియో వైరల్‌ | Donald Trump Old Video Made Viral After Moscow Terror Attacks, Details Inside - Sakshi
Sakshi News home page

మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్‌ పాత వీడియో వైరల్‌

Published Sun, Mar 24 2024 10:52 AM | Last Updated on Sun, Mar 24 2024 1:23 PM

Trump Old Video Made Viral On Moscow Terror Attacks - Sakshi

వాషింగ్టన్‌: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్‌ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు.

‘ఒబామా ఐసిస్‌ ఫౌండర్‌. ఐసిస్‌ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్‌ కో ఫౌండర్‌ హిల్లరీ క్లింటన్‌’ అని వీడియోలో ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్‌ స్పందన  అని సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్‌ మాట్లాడిన వీడియో కాదని తేలింది.

ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్‌ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్‌ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్‌ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. 

ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement