
'జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గాయి'
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడులు 25 శాతం తగ్గాయని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లోని భద్రతా అంశాలపై ప్రస్తావిస్తూ అక్కడ ఉగ్రదాడులు 25 తగ్గాయని ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన అంశాలలో విశేషమైన అభివృద్ధి సాధించామని హోం మంత్రి వివరించారు. శాంతి, భద్రత వాతావరణం ఉన్న ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.