
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి పిరికి పందల చర్య. వీరులైన జవాన్లకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శోకంలో ఉన్న అమరవీరుల జవాన్ల కుటుంబాల పరిస్థితికి నా హృదయం ద్రవిస్తోంది. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment