
సమస్త ఉగ్రవాద చర్యలకూ వాళ్లే కారణమా?
ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించిన వారని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రకటించడం తప్పు. భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలు బాధ్యులు కారని గణాంకాలు సుస్పష్టం చేస్తున్నాయి.
ఆకార్ పటేల్
ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించిన వారని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రకటించడం తప్పు. భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలు బాధ్యులు కారని గణాంకాలు సుస్పష్టం చేస్తున్నాయి.
భారతీయ ముస్లింల లో చాలామంది ఉగ్ర వాదులేనా? ఈ అంశం తోపాటు ఈ వారం మరొక అవాంఛనీయ ఘటన కూడా నా దృష్టి కి వచ్చింది.. ‘రాజీవ్ గాంధీ ఒక తెల్లమ్మాయి ని కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడి ఉంటే, కాంగ్రెస్‌పార్టీ ఆమె నాయ కత్వాన్ని ఆమోదించేదా?’ ఇది కేంద్ర మంత్రి గిరి రాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్య. భారత్‌లో సర్వసాధార ణంగా రంగుకు సంబంధించి ఉనికిలో ఉంటున్న జాతివివక్షతను ఈ వ్యాఖ్య బయటపెట్టింది. ‘ప్రధా ని నరేంద్రమోదీ దీనిపై తగు చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ నైజీరియా రాయబారి ఓబీ ఓకోన్‌గోర్ బాధను వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎప్పటిలాగే ప్రధాని పెద్దగా పట్టించుకోలేదు.
‘గిరిరాజ్ సింగ్ నోరుమూయించడానికి 5 కారణాలు’ అనే శీర్షికతో ప్రముఖ ఇంగ్లిష్ వెబ్ సైట్ రెడిఫ్.కామ్ ఒక కామెంటరీని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ వెబ్‌సైట్ గత ఏడాది మంత్రి చేసిన ప్రకటనను ఆ కామెంటరీలో పొందుపర్చింది. ‘ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారం దరూ ఒకే మతానికి చెందినవారుగా ఉండటం నిజం కాదా? ఒక ప్రత్యేక మతాన్ని నేను నిందించ దల్చుకోలేదు. మన ఘనత వహించిన సెక్యులర్ పార్టీలు దీనిపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?’ గిరిరాజ్‌సింగ్ వేసిన ప్రశ్న ఇది. బహుశా కేంద్ర మంత్రి ముస్లింల గురించే ప్రస్తావించి ఉంటారు. అయితే ఉగ్రవాద చర్యల్లో పట్టుబడిన వారందరూ ఒక మతానికి సంబంధించినవారని ఆయన ప్రక టించడం సరైంది కాదు. అయితే భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ముస్లింలే బాధ్యులా? ‘ది సౌత్ ఆసియన్ టెర్రిరిజం పోర్టల్’ ఇటీవలే దేశవ్యా ప్తంగా దాడుల్లో మృతులు, ఘటనల జాబితాను ప్రకటించింది. మరింత సహాయకారిగా ఆ పోర్టల్ ఘర్షణలు జరిగిన ప్రాంతం వారీగా జాబితాను రూపొందించింది.
దీనిప్రకారం 2014లో ఉగ్రవాదం (లేదా తీవ్ర వాదం) వల్ల భారత్‌లో 976 మంది చనిపోయారు. వీరిలో 465 మంది ఈశాన్య భారత్‌లో మృతి చెం దారు. ఇక మావోయిస్టు గ్రూప్‌కు చెందిన వామపక్ష తీవ్రవాదం వల్ల 314 మంది మరణించారు. ఉగ్ర వాదానికి మూలబిందువుగా మనం భావిస్తున్న జమ్మూకశ్మీర్‌లో మృతుల సంఖ్య 193 మంది మాత్రమే. ఈ ఘర్షణాత్మక ప్రాంతాలకు వెలుపల నలుగురిని మాత్రమే హతమార్చినట్లు ఇస్లామిక్ తీవ్ర వాదం బాధ్యతను ప్రకటించుకుంది. 2013లో మావోయిస్టులు ఎక్కువగా 421 మందిని హతమా ర్చగా, 251 మందిని చంపిన ఈశాన్య తీవ్రవాదం రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్‌లోనూ, ఆ రాష్ట్రం మినహా బయటి రాష్ట్రాలలో ఇస్లామిక్ హింసలో చనిపోయింది 206 మంది. 2012లో కూడా ఇదే విధంగా మావోయిస్టులు 367 మందిని, ఈశాన్య ఉగ్రవాదం 326 మందిని, కశ్మీర్ తీవ్రవాదులు 117 మందిని చంపివేయగా ఈ మూడింటికీ వెలుపల ఇస్లామిక్ ఉగ్రవాద బాధితుల సంఖ్య కేవలం ఒక్కటి మాత్రమే. 2011లో మావోయిస్టు హింసలో 602 మంది చనిపోగా, ఈశాన్య భారత్ ఘర్షణల్లో 246 మంది చనిపోయారు. ఇక కశ్మీర్, దాని వెలు పల ఇస్లామిక్ తీవ్రవాద చర్యల్లో 225 మంది హతు లయ్యారు. గత దశాబ్దంగా దేశంలో హింసాత్మక చర్యలు తగ్గుముఖం పడుతున్నాయి.
దీన్నిబట్టి చూస్తే భారత్‌లోని ఉగ్రవాదుల్లో అధికులు హిందువులే అన్నది స్పష్టం. అయితే వీరి ని హిందువులు అనడానికి బదులుగా మనకు సౌక ర్యవంతంగా ఉంటుందని మావోయిస్టులు అని ముద్రవేసేశాం. ఇక మన ఉగ్రవాదుల్లో రెండో స్థానంలో ఉన్నవారు ఈశాన్య భారత్‌లోని గిరిజ నులు, కొంత మంది క్రైస్తవులు. కశ్మీర్ వెలుపల వేర్పాటువాదంకేసి చూస్తే, వీరు చేపడుతున్న హిం సాత్మక, ఉగ్రవాద చర్యలు ప్రపంచంలోనే అతి తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు, భారత్‌లో హిందువులతో పోల్చిచూస్తే మన దేశంలో ఉగ్ర వాద చర్యల్లో పాల్గొంటున్న ముస్లింల సంఖ్య అతి తక్కువేనని స్పష్టమవుతోంది.
భారత్‌లో ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు ‘ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు కానీ, ఉగ్రవా దులందరూ ముస్లింలుగానే ఎందుకు రికార్డుకెక్కు తున్నారు’ అనే ప్రశ్నను ఎన్నిసార్లు వింటూ వచ్చా నో లెక్కచెప్పలేను. నిజాలను నిగ్గుతేల్చితే ముస్లిం లందరూ ఉగ్రవాదులు కారు. ఆ అంచనాకు సమీ పంగా కూడా వారు లేరు. మన దేశంలో సామా న్యులు ముస్లింలపై అలాంటి వాదనలు చేస్తుం డటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రవచనాలను నిత్యం వల్లించడం చూస్తుంటే, ఎంతటి అనుచిత వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది.
సూత్రవిరుద్ధమైన ఇలాంటి వ్యక్తులను మోదీ ఎందుకు ఉద్దేశపూర్వకంగా తన మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని గిరిరాజ్ వ్యాఖ్య తర్వాత ఒక టీవీషోలో నేను ప్రశ్నించాను. మోదీ తాను బహిరం గంగా చెప్పలేని విషయాలను వారి ద్వారా చెప్పిం చాలనుకుంటున్నారు. గిరిరాజ్ ఇలాంటి సందర్భా ల్లో వ్యక్తపరుస్తున్న ప్రతి పదంతోనూ మోదీకి ఏకీ భావం ఉంది. అందుకే తనకు కేంద్ర మంత్రివర్గం లో స్థానం దక్కింది. కేంద్ర కేబినెట్‌లోని అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి శాంతమూర్తుల జాబి తాను ఈ చర్చలో భాగంగా చదువుతున్న బీజేపీ ప్రతినిధిని నా వ్యాఖ్య తీవ్రంగా కలవరపర్చింది.
అయితే సుష్మా, జైట్లీవంటి వ్యక్తులు బీజేపీకి చెందిన ఏ మంత్రివర్గంలో అయినా సభ్యులుగా చేరగలుగుతారు. మోదీకి ముందు కూడా వీరు కేంద్రంలో నేతలుగా ఉండేవారు. కానీ గిరిరాజ్, నిరంజన్ జ్యోతి (హిందూయేతరులను ‘బాస్టర్డ్స్’ పదంతో సత్కరించిన వ్యక్తి) వంటి మోదీ తీసు కొచ్చిన కొత్త మంత్రులతోటే అసలు చిక్కు. వీళ్లు ఎంత బోగస్ ప్రకటనలను చేసినా సరే మోదీ వాటిని అంగీకరిస్తున్నారు కాబట్టే ఇలాంటివారు కేబినెట్‌లో భాగం అవుతున్నారు.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
ఈమెయిల్:aakar.patel@icloud.com