జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ మన దేశంపై రగులుతూనే ఉంది. ఎలాగైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఉగ్రవాదులతో భారత్‌పై దాడులకు తెగబడాలని చూస్తోంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో అక్కడ పాక్ పన్నాగాలు పారడంలేదు. ఎల్‌వోసీ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి చేస్తున్న ప్రయత్నాలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. దీంతో ఉత్తర భారతంలో తమ ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో తాజాగా ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.