కొలంబో : శ్రీలంక ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 21 ఉగ్రదాడి అనంతరం దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేటి (జూన్ 22) తో ముగియనున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ డిక్రీ జారీ అయ్యింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంకా అత్యవసర పరిస్థితి ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజా భద్రత చట్ట నిబంధనలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
దేశ రాజధాని కొలంబో నగరంలో ఈస్టర్ సండే రోజు హోటళ్లు, చర్చిలపై దాడులు నేపథ్యంలో శ్రీలంక అతలాకుతలమైంది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 258కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల సంఘటన తరువాత దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment