
సాక్షి, పంచకుల : రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. 38 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించున్న విషయాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. గుర్మీత్ సింగ్‌పై పంచకుల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన ఆగస్టు 25న అల్లర్లు జరిగాక.. హనీప్రీత్ అదృశ్యమైంది. ఈ మధ్యే కోర్టులో లొంగిపోయిన హనీప్రీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి.
ఆగస్టు 25 తరువాత అదృశ్యమైన హనీప్రీత్.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రెండు రకాల సెల్‌ఫోన్లు వినియోగించినట్లు తెలిసింది. అంతేకాక 2 ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు, 16 స్థానిక సిమ్ కార్డులను మార్చిమార్చి వినియోగిస్తూ.. తప్పించుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనూ హనీప్రీత్ వాట్సప్‌ను ఉపయోగించిందని.. అయితే అందులోని డేటా ఇంకా లభించలేదని సిట్ పోలీసులు తెలిపారు. హనీప్రీత్ కాల్‌డేటాను సంపాదించే పనిలో ఉన్నామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా హనీప్రీత్ ఏ మాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఒకరకంగా ఆమె మా సహనాన్ని పరీక్షిస్తోందని సిట్ అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment