Honeypreet
-
హనీ హైడింగ్ వెనక..
సాక్షి, పంచకుల : రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. 38 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించున్న విషయాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. గుర్మీత్ సింగ్‌పై పంచకుల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన ఆగస్టు 25న అల్లర్లు జరిగాక.. హనీప్రీత్ అదృశ్యమైంది. ఈ మధ్యే కోర్టులో లొంగిపోయిన హనీప్రీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి. ఆగస్టు 25 తరువాత అదృశ్యమైన హనీప్రీత్.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రెండు రకాల సెల్ఫోన్లు వినియోగించినట్లు తెలిసింది. అంతేకాక 2 ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు, 16 స్థానిక సిమ్ కార్డులను మార్చిమార్చి వినియోగిస్తూ.. తప్పించుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనూ హనీప్రీత్ వాట్సప్‌ను ఉపయోగించిందని.. అయితే అందులోని డేటా ఇంకా లభించలేదని సిట్ పోలీసులు తెలిపారు. హనీప్రీత్ కాల్‌డేటాను సంపాదించే పనిలో ఉన్నామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా హనీప్రీత్ ఏ మాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఒకరకంగా ఆమె మా సహనాన్ని పరీక్షిస్తోందని సిట్ అధికారులు అంటున్నారు. -
మాస్టర్ మైండ్ ‘హనీప్రీత్’
సాక్షి, పంచకుల : డేరా సచ్చాసౌధా మాజీ అధిపతి, రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌బాబా తీర్పు తరువాత జరిగిన అల్లర్లకు ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌నే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్ ఇన్సాన్ కోటి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. గుర్మీత్ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు.. తాజాగా గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్‌ని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే పలు విషయాలు వెలుగు చూశాయని సీట్ అధికారి ఏసీపీ ముఖేష్ తెలిపారు. గుర్మీత్‌పై తీర్పు సమయంలో ఆయనతో పాటు దత్తపుత్రిక హనీప్రీత్, వ్యక్తిగత సహాయకుడు రాకేష్ కుమార్ వెంట ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే అల్లర్లకు వారు పథకం రచించారని అందుకోసం కోటి 25 లక్షల రూపాయలను వినియోగించారని సిట్ అధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని పంచకుల కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ చావ్లా సైతం ధృవీకరించారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు రాకేష్ కుమార్, హనీప్రీత్‌లను విచారణ చేస్తున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ల కోసం గాలిస్తున్నట్లు అధికారలు తెలిపారు. ఇదిలా ఉండగా హనీప్రీత్, ఆమె భర్త ఇక్బాల్ సింగ్, సుఖ్‌దీప్‌లు డేరా కోర్ కమిటీ సభ్యులుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో సుఖ్దీప్ డేరా అనుచరులకు ఆయుధాలను ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. డేరా ప్రధానకార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ విభాగం విశ్లేషణ చేస్తున్నారని చెప్పారు. హార్డ్ డిస్క్‌ల్లోని విషయం బయటకు వస్తే.. మరింత సమాచారం తెలుస్తుందని సిట్ అధికారులు చెబుతున్నారు. -
హనీప్రీత్‌సింగ్‌కు 6 రోజుల పోలీసుల కస్టడీ
-
డేరా బాబా మామూలోడు కాదు
-
బాంబు పేల్చిన హనీప్రీత్ మాజీ భర్త
సిర్సా: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌పై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డేరా బాబాకు హనీప్రీత్ దత్తపుత్రిక కాదని, చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదని వెల్లడించారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. 'తన డేరాలో గుర్మీత్ బిస్బాస్లా వ్యవహరించేవారు. ఆరు జంటలు(కుటుంబ సభ్యులు) 28 రోజుల పాటు డేరాలో ఉన్నాం. రాత్రిళ్లు హనీప్రీత్... గుర్మీత్ గదిలోనే ఉండేది. నన్ను మాత్రం గది బయట పడుకోమనేవార'ని గుప్తా తెలిపారు. గుర్మీత్‌తో ఏకాంతంగా గడుపుతుండగా హానీప్రీత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను బెదిరించారని వెల్లడించారు. తన భార్యతో గుర్మీత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 2011లో గుప్తా కోర్టుకు వెళ్లారు. ఆయుధాలతో కూడిన పెద్ద పెట్టెను గుర్మీత్ ఎల్లప్పుడు తన వెంట ఉంచుకునేవారని, అనుచరులు ఈ పెట్టెను అతడు ప్రయాణించే కారులో పెట్టేవారని గుప్తా వివరించారు. కాగా, గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని.. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఇంతకుముందు ఓ సాధ్వి చెప్పారు. మరోవైపు హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలిస్తున్నారు. ఆమె నేపాల్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను అధికారులు తోసిపుచ్చారు. హనీప్రీత్ తమ దేశంలో లేదని నేపాల్ సీబీఐ కూడా స్పష్టం చేసింది. -
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
-
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తరువాత.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు భారీగా నాశనమయ్యాయి. ఈ నష్టాన్ని గుర్మీత్ ఆస్తులతో భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆయా ప్రభుత్వాలు ఆ పనిలోకి దిగాయి. డేరా ఆస్తులను పరిశీలించే క్రమంలో ప్రభుత్వాధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. డేరాబాబా స్థిరచరాస్తుల విలువ వందల వేల కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క డేరాబాబా, ఆయన దత్తపుత్రిక హనిప్రీత్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లలో రూ. 75 కోట్లు బయటపడ్డాయి. వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల నగదు అకౌంట్లలో ఉన్నట్లు తేలింది. ఆస్తుల వివరాలు.. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు.. రూ. 74.96 కోట్లు గుర్మీత్‌కు చెందిన 12 అకౌంట్లలో ...రూ. 7.72 కోట్లు హనిప్రీత్ అకౌంట్లో.. రూ. కోటి హర్కీత్ ఎంటర్టైన్మెంట్స్.. రూ. 50 లక్షలు వివిధ బ్యాంకుల్లో మొత్తం అకౌంట్లు.. 504 (అందులో 473 సేవింగ్స్ ఖాతాలు, మిగిలినవి లోన్ ఖాతాలు) గుర్మీత్ పేరున ఉన్న స్థిరాస్తఉలు.. 25 హర్యానా, పంజాబ్‌లో ఉన్న స్థిరాస్తుల విలువ... రూ. 1,435 కోట్లు పలు బ్యాంకుల్లో కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. -
గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!
-
గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!
సాక్షి, చండీగఢ్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే హనీప్రీత్, గుర్మీత్‌ల సంబంధం గురించి షాకింగ్ విషయం తాజాగా వెలుగుచూసింది. గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని డేరాలోని ఓ సాధ్వి చెప్పారు. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఆమె తెలిపారు. గుర్మీత్ తర్వాత డేరా చీఫ్‌గా బాధ్యతలు చేపడుతుందని అందరూ భావిస్తున్న హనీప్రీత్ తన అందం గురించి దిగులు చెందేదట. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ మీడియాకు తెలిపారు. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు పిచ్చి అభిమాని అని.. అందుకు కత్రినాలా అందంగా తయారవ్వాలన్న ఆశే కారణమని వెల్లడించారు. 'నటి కత్రినాలా తను కూడా చాలా అందంగా తయారవ్వాలనుకున్న హనీప్రీత్ ఎంతో శ్రమించి వర్కవుట్లు చేసేవారు. గ్లామర్ డాల్‌గా మారిపోవాలన్నది ఆమె చిరకాల కోరిక. అందుకే వర్కవుట్లు చేస్తూ ఆలసట చెందినట్లు అనిపిస్తే చాలు.. దూమ్ 3 మూవీలోని కత్రినా పాటకు హుషారుగా స్టెప్పులేస్తూ ఆలసటను, శ్రమను మర్చిపోయేది. గుర్మీత్ కూడా తన వద్దే అదే జిమ్‌లో కసరత్తులు చేసేవాడు. కత్రినాలా తాను నాజుకూగా మారేందుకు ప్రతిరోజు మూడు గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేయడంతో కఠిన ఆహారపు అలవాట్లను హనీప్రీత్ ఫాలో అయ్యేదంటూ' ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ వివరించారు. గత ఆగస్ట్ 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా, అప్పటినుంచి ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పరారీలో ఉంది. మరోవైపు సీబీఐ అధికారులు ఇదివరకే డేరాలో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి పలు కీలక సాక్ష్యాలు సేకరించారు. గుర్మీత్ చేసిన హత్యల కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆమె రాజస్థాన్‌లో ఉందా?!
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ముఖ్య అనుచరురాలు హనీప్రీత్ ఇన్సాన్ రాజస్థాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మొబైల్ ఫోన్ సిగ్నల్స్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ట్రేస్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేస్తేనే డేరాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. గుర్మీత్‌కు శిక్ష పడ్డాక.. హనీప్రీత్ కనిపించకుండా పోయారు. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసేందుకు లుక్అవుట్ నోటీస్‌ను పోలీసులు ఇచ్చారు. రెండురోజుల కిందట.. హనీప్రీత్ ఫొటోలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల, ప్రధానంగా సరిహధ్దు ప్రాంతాల్లోని స్టేషన్లకు పంపారు. ఈ నేపథ్యంలో హనీ ప్రీత్ ఫోన్ రాజస్థాన్‌లో ట్రేస్ అవడం పెద్ద విషయమేనని అధికారులు చెబుతున్నారు. నిన్నరాత్రి హనీప్రీత్ తన మొబైల్ నుంచి డేరా ఉన్నతాధికారికి ఫోన్ చేసిందని.. ఆ ఫోన్వల్లే ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. -
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
-
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
-
బాబా వారసులు హానీప్రీత్ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా సచ్చా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన డేరాకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న మరోసారి తెర ముందుకు వచ్చింది. బాబాను కోర్టు దోషిగా నిర్ధారించిన రోజున ఆయన వెంట ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన పెంపుడు కూతురు హానీ ప్రీత్ ఇన్సాన్ ప్రయాణించడంతో ఆమెనే ఆయనకు వారసురాలనే ప్రచారం జరిగింది. గుర్మీత్ సింగ్ సొంత కూతుళ్లు అమన్‌ప్రీత్, చరణ్‌ప్రీత్, కుమారుడు జస్మీత్ ఇన్సాన్ కన్నా హానీ ప్రీత్‌కే డేరాలో ఎక్కువ పలుకుబడి ఉండడంతో ఆమెనే డేరా నాయకులవుతారని ఇప్పటికీ డేరా అనుచరులు భావిస్తున్నారు. ట్విట్టర్లో పది లక్షల మంది, ఫేస్బుక్లో ఐదు లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1,88,000 మంది ఫాలోవర్లను కలిగిన హానీ ప్రీత్ సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. పెంపుడు తండ్రి సింగ్‌ను దైవంగాను, రాజులకు రాజుగాను అస్తమానం అభివర్ణించే హానీ ప్రీత్ తన వెబ్సైట్లో ఎక్కువగా తండ్రి బోధనల గురించే ప్రచారం చేస్తారు. ఆయన ట్వీట్లను ఎక్కువగా ట్విట్టర్లో రీట్వీట్ చేస్తుంటారు. 'ఎంఎస్‌జీ ది వారియర్:లైన్ హార్ట్' సిరీస్ సినిమాలతోపాటు సింగ్ తీసిన అన్ని సినిమాల్లో నటించిన హానీ ప్రీత్ తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్ ఎడిటర్‌నని, రచయితనని, అన్నింటికన్నా సింగ్‌కు గొప్ప కూతురునని చెప్పుకుంటారు. ఆమె ఎంఎస్‌జీ సిరీస్ సినిమాల్లో తన తండ్రి పేరుతోపాటు 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్‌గా వేసుకున్నారు. గుర్నీత్ సింగ్‌కు హానీ ప్రీత్ ఎలా పరిచయం? హానీ ప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో సచ్చా డేరా ఫాలోవర్ విశ్వాస్ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాక తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని ఆమె గుర్నీత్ను కలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఆయన ఆమెను తన పెంపుడు కూతురుగా దత్తత తీసుకున్నారు. ఆమె భర్త విశ్వాస్ గుప్తాకు ఆశ్రమంలో మంచి స్థానం కల్పించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే హానీ ప్రీత్ భర్తతోని కాపురానికి వెళ్లకుండా తండ్రితోనే ఉండిపోవడంతో తన భార్యను తనకు అప్పగించాల్సిందిగా కోరుతూ 2011లో విశ్వాస్ గుప్తా కోర్టుకు ఎక్కారు. అప్పుడు హానీ ప్రీత్ విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజా నిజాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఇక ముందు బయ టకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ (30). ‘తండ్రి ముద్దుల కూతురు, పరోపకారి, దర్శకురాలు, సంపాదకురాలు, నటి’ ఇవి సోషల్ మీడియాపై హనీ ప్రీత్ సింగ్ పరిచయ వాక్యాలు. డేరా చీఫ్ గుర్మీత్‌కు ఈమె దత్త పుత్రిక. ఈమె ట్విటర్ అకౌంట్‌కు 10 లక్షల మంది, ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తండ్రితో ‘ఎంఎస్‌జీ 2 – ద మెసెంజర్’, ఎంఎస్‌జీ – ద వారియర్ లయన్ హార్ట్’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. అంతేకాదు గుర్మీత్ నటించిన చిత్రాలకు ఈమే దర్శకురాలు, ఎడిటర్ కావటం విశేషం. ఈమెకు సొంతంగా "www. HoneypreetInsan.me' అనే వెబ్సైట్ కూడా ఉంది. ‘అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు’ అని ఈ సైట్లో పెద్దగా రాసి ఉంటుంది. ‘50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గురుపా’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి చీకటి క్షణాన్ని తేజోవంతం చేసినందుకు ధన్యవాదాలు’ అని ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా హనీప్రీత్ ట్వీట్ చేశారు. ఇప్పుడు తండ్రి గైర్హాజరీలో డేరా సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత హనీప్రీత్‌దే. గుర్మీత్ సీబీఐ కోర్టుకు వచ్చినపుడు తండ్రితోపాటుగా ఈమె కూడా వచ్చింది. గుర్మీత్ సింగ్ భార్య హర్జీత్ కౌర్. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.