
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తరువాత.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు భారీగా నాశనమయ్యాయి. ఈ నష్టాన్ని గుర్మీత్ ఆస్తులతో భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆయా ప్రభుత్వాలు ఆ పనిలోకి దిగాయి.
డేరా ఆస్తులను పరిశీలించే క్రమంలో ప్రభుత్వాధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. డేరాబాబా స్థిరచరాస్తుల విలువ వందల వేల కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క డేరాబాబా, ఆయన దత్తపుత్రిక హనిప్రీత్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లలో రూ. 75 కోట్లు బయటపడ్డాయి. వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల నగదు అకౌంట్లలో ఉన్నట్లు తేలింది.
ఆస్తుల వివరాలు..
- వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు.. రూ. 74.96 కోట్లు
- గుర్మీత్‌కు చెందిన 12 అకౌంట్లలో ...రూ. 7.72 కోట్లు
- హనిప్రీత్ అకౌంట్లో.. రూ. కోటి
- హర్కీత్ ఎంటర్‌టైన్‌మెంట్స్.. రూ. 50 లక్షలు
- వివిధ బ్యాంకుల్లో మొత్తం అకౌంట్లు.. 504 (అందులో 473 సేవింగ్స్ ఖాతాలు, మిగిలినవి లోన్ ఖాతాలు)
- గుర్మీత్ పేరున ఉన్న స్థిరాస్తఉలు.. 25
- హర్యానా, పంజాబ్‌లో ఉన్న స్థిరాస్తుల విలువ... రూ. 1,435 కోట్లు
-
పలు బ్యాంకుల్లో కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.