మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు అకాల్‌ తఖ్త్‌ శిక్ష | Akali Dal Chief Sukhbir Badal Ordered To Clean Utensils And Shoes, Perform Guard Duty At Golden Temple | Sakshi
Sakshi News home page

మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు అకాల్‌ తఖ్త్‌ శిక్ష

Published Mon, Dec 2 2024 9:28 PM | Last Updated on Mon, Dec 2 2024 9:35 PM

Akali Dal Chief Sukhbir Badal Ordered To Clean Utensils And Shoes, Perform Guard Duty At Golden Temple

ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది.  

అంతేకాదు.. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ తండ్రి, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.

2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్‌ క్షమాపణలు చెప్పడంతో అకాల్‌ తఖ్త్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్‌ తఖ్త్‌ ఆదేశాల్ని సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్‌  పాటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement