sukhbir badal
-
మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష
ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాపణలు చెప్పడంతో అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్ తఖ్త్ ఆదేశాల్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటించనున్నారు. VIDEO | Five high priests headed by Akal Takht Jathedar Giani Raghbir Singh pronounce punishment for former Punjab deputy CM Sukhbir Singh Badal for religious misconduct.On August 30, Sukhbir was declared ‘tankhaiya’ by Akal Takht, which held him guilty of religious misconduct… pic.twitter.com/MwPKXI1OS3— Press Trust of India (@PTI_News) December 2, 2024 -
'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'
జలాలాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ నియోజకవర్గం శిరోమణి అకాలీదల్ పార్టీకీ కంచుకోటలాంటిది. పంజాబ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దీంతో అకాలీదల్ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. తాజాగా జలాలాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రమీందర్ ఆవ్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా రమీందర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అకాలీదల్‌కు మంచి పట్టున్న జలాలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. బీజేపీ- అకాలీదల్ పాలనలో ఇక్కడ గూండారాజ్యం కొనసాగిందని, అడ్డు వచ్చిన వారిపై నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారని తెలిపారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనడానికి తన గెలుపు ఒక కారణమని రమీందర్ వెల్లడించారు. 2017లో సుఖబీర్‌సింగ్ విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీ- అకాలీదల్ పాలనలో వారు పెట్టిన నకిలీ కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరించారని గుర్తుచేశారు.దీంతో అకాలీదల్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సుఖ్బీర్ సింగ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తన బాధ్యతను విస్మరించారు. అందుకే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అకాలీదల్‌ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జలాలాబాద్ ప్రజలకు రమీందర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. రైస్ మిల్లర్ వ్యాపారులకు ఆశించినంత మేర వ్యాపారం జరగకపోవడంతో ఎక్కువ మొత్తంలో మిల్లులు మూసివేయడం గుర్తించాను. అలాగే ఈ ప్రాంతంలోని స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దారుణం అని వెల్లడించారు. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా బలంగా ఉంది. ఈ సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తానని తెలిపారు. -
సిద్ధూ మానవబాంబు లాంటివాడు: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మళ్లీ మాతృసంస్థలోకి వచ్చినట్లుందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ వ్యాఖ్యలపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన భార్య హర్సిమ్రత్ బాదల్ మండిపడ్డారు. సిద్ధూ మానవబాంబు లాంటివాడని, అతడు ఆరు నెలల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమని, కావాలంటే రాసిస్తానని కూడా అన్నారు. సిద్ధూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తన తల్లిని మార్చేస్తారని, ఆయనకు ఎంతమంది తల్లులు (పార్టీలు) ఉన్నారో అడగాలనుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ఎద్దేవా చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కావాలన్నదే ఏకైక ఎజెండా అని, దాంతోపాటు ప్రతి విషయానికీ ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తుంటారని విమర్శించారు. సిక్కులను ఊచకోత కోసిన పార్టీలోకి వెళ్లి, దాన్ని ఘర్వాప్సీ అంటూ వ్యాఖ్యానించిన సిద్ధూకు అభినందనలని సుఖ్బీర్ భార్య హర్సిమ్రత్ బాదల్ ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులు తమ కాళ్లను రెండు పడవల మీద కాకుండా మూడు పడవల మీద పెడతారని, కొన్నాళ్లు బీజేపీ.. మరికొన్నాళ్లు కాంగ్రెస్ అంటారని, ఇంకొంత దూరం వెళ్లి పాకిస్థాన్‌లో కూడా చేరొచ్చు కదా అని మండిపడ్డారు. ఇక పంజాబ్‌లో 70 శాతం మంది ఎప్పుడూ మత్తులో ఉంటారన్న రాహుల్ గాంధీయే బహుశా అందరికంటే ఎక్కువ మత్తులో ఉండి ఉంటారని తనకు అనిపిస్తోందని కూడా హర్సిమ్రత్ విమర్శించారు. -
‘డిప్యూటీ సీఎం వద్ద 63 నకిలీ సీడీలు’
లుథియానా: తమకు వ్యతిరేకంగా పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ వద్ద 63 నకిలీ సీడీలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సీడీలను రోజుకు రెండుమూడు చొప్పున విడుదల చేస్తుంటారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం లుథియానా చేరుకున్న కేజ్రీవాల్ కు రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్, అకాలీదళ్ నిరసనలతో స్వాగతం పలికాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ‘కేజ్రీవాల్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కొంత మంది మహిళలు కేజ్రీవాల్ పైకి గాజులు విసిరారు. లుథియానా అకాలీదళ్ అధ్యక్షుడు గురుదీప్ సింగ్ గోషా కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.