‘డిప్యూటీ సీఎం వద్ద 63 నకిలీ సీడీలు’
లుథియానా: తమకు వ్యతిరేకంగా పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ వద్ద 63 నకిలీ సీడీలు ఉన్నాయని తమకు సమాచారం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సీడీలను రోజుకు రెండుమూడు చొప్పున విడుదల చేస్తుంటారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ప్రచారం కోసం లుథియానా చేరుకున్న కేజ్రీవాల్ కు రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్, అకాలీదళ్ నిరసనలతో స్వాగతం పలికాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ‘కేజ్రీవాల్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కొంత మంది మహిళలు కేజ్రీవాల్ పైకి గాజులు విసిరారు. లుథియానా అకాలీదళ్ అధ్యక్షుడు గురుదీప్ సింగ్ గోషా కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.