Gurmeet Ram Rahim
-
మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష
ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాపణలు చెప్పడంతో అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్ తఖ్త్ ఆదేశాల్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటించనున్నారు. VIDEO | Five high priests headed by Akal Takht Jathedar Giani Raghbir Singh pronounce punishment for former Punjab deputy CM Sukhbir Singh Badal for religious misconduct.On August 30, Sukhbir was declared ‘tankhaiya’ by Akal Takht, which held him guilty of religious misconduct… pic.twitter.com/MwPKXI1OS3— Press Trust of India (@PTI_News) December 2, 2024 -
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
డేరా బాబాకు రహస్య పెరోల్
చండిఘర్ : మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ (డేరా బాబా)బాబాకు రహస్యంగా పెరోల్ మంజూరైంది. ఒకరోజు పెరోల్‌పై డేరా బాబా బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి డేరా బాబాకు హరియాణా ప్రభుత్వం అక్టోబర్ 24 న పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్ లభించిన విషయం మీడియాకు కూడా తెలియకుండా హరియాణా ప్రభుత్వం జాగ్రత్తపడింది. భారీ బందోబస్తు మధ్య గత నెల 24న గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడడానికి డేరా బాబాను తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకూ డేరా బాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు. డేరా బాబాకు పెరోల్ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రాష్ట్ర జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అన్ని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రామ్ రహీమ్‌కు పెరోల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. -
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
-
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తరువాత.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు భారీగా నాశనమయ్యాయి. ఈ నష్టాన్ని గుర్మీత్ ఆస్తులతో భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆయా ప్రభుత్వాలు ఆ పనిలోకి దిగాయి. డేరా ఆస్తులను పరిశీలించే క్రమంలో ప్రభుత్వాధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. డేరాబాబా స్థిరచరాస్తుల విలువ వందల వేల కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క డేరాబాబా, ఆయన దత్తపుత్రిక హనిప్రీత్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లలో రూ. 75 కోట్లు బయటపడ్డాయి. వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల నగదు అకౌంట్లలో ఉన్నట్లు తేలింది. ఆస్తుల వివరాలు.. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు.. రూ. 74.96 కోట్లు గుర్మీత్‌కు చెందిన 12 అకౌంట్లలో ...రూ. 7.72 కోట్లు హనిప్రీత్ అకౌంట్లో.. రూ. కోటి హర్కీత్ ఎంటర్టైన్మెంట్స్.. రూ. 50 లక్షలు వివిధ బ్యాంకుల్లో మొత్తం అకౌంట్లు.. 504 (అందులో 473 సేవింగ్స్ ఖాతాలు, మిగిలినవి లోన్ ఖాతాలు) గుర్మీత్ పేరున ఉన్న స్థిరాస్తఉలు.. 25 హర్యానా, పంజాబ్‌లో ఉన్న స్థిరాస్తుల విలువ... రూ. 1,435 కోట్లు పలు బ్యాంకుల్లో కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. -
డేరాబాబాకు పారిపోయే ప్లాన్
సాక్షి, చండీగఢ్ : హర్యానా పోలీసులు తాజాగా మరో అరెస్టులు చేశారు. అయితే, వారు అరెస్టు చేసింది మాత్రం పోలీసులనే. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషి అని తేల్చిన తర్వాత కూడా అతడిని పారిపోయేందుకు సహాయం చేసిన ముగ్గురు పోలీసులను ద్రోహంవంటి ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉండగా మరొకరు కానిస్టేబుల్. ప్రస్తుతం వారిని విచారణలో భాగం చేసినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 25న పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. ఆ సమయంలో వారు గుర్మీత్‌కు ఆయన భద్రతకు సంబంధించిన వివరాలు తెలియజేసి ఆయన పారిపోయేందుకు కుట్రలు చేశారు. ప్రస్తుతం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన వారిని మూడు రోజులపాటు విచారించనున్నారు. -
గుర్మీత్ అకౌంట్ క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో జైలు పాలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఓ వైపు గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు కాగ, మరోవైపు గుర్మీత్ మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా భారత్‌లో నిలిపివేశారు. ఈ నిలుపుదలతో భారత్‌లో ఆయన ఫాలోవర్స్ ఎవరూ గుర్మీత్ అకౌంట్‌ను యాక్సస్ చేయడం కానీ, ట్వీట్లు చూడటం కానీ వీలుపడదు. అయితే భారత్‌లో మాత్రమే ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేశారు. విదేశీయులు మాత్రం డేరా సచ్చా సౌదా పోస్టులను చూడవచ్చు. ఇప్పటివరకు గుర్మీత్‌కు 3.6 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ అభ్యర్థన మేరకు ఆయన అకౌంట్‌ను బ్లాక్చేశామని హర్యానాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. డేరాతో సంబంధమున్న ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వారు చూడటానికి ఇష్టపడుట లేదని పేర్కొన్నారు. @గుర్మీత్రామ్రహీమ్ ఖాతా నిలిపివేయబడింది అనే మెసేజ్ మాత్రమే ఆయన అకౌంట్ పేజీలో ప్రస్తుతం దర్శనమిస్తోంది. ఆయన ట్వీట్లు ఏమీ కనిపించడం లేదు. ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో దోషిగా తేలిన వివాదస్పద డేరా చీఫ్ గుర్మీత్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్ తీర్పు నేపథ్యంలో ఉత్తర భారతం ఉడికిపోయింది. పంజాబ్, హర్యానాలో గుర్మీత్ మద్దతుదారులు ఆందోళనలు చేశారు. -
డేరా బాబా పడక గది తెరచిన పోలీసులు
-
సీఎం ఖట్టర్ తొలగింపు: బీజేపీ క్లారిటీ
న్యూఢిల్లీ: గుర్మీత్ రాం రహీం సింగ్ మద్దతుదారుల విధ్వంసం నేపథ్యంలో హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌పై బీజేపీ అధిష్టానం వేటు వేయనుందని వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. హరియాణ సీఎంగా ఖట్టర్‌ను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. హరియాణ బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అనిల్ జైన్, సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియాతో భేటీ అయిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా తాజా విధ్వంసం నేపథ్యంలో ఖట్టర్‌ను ఢిల్లీకి పిలిపించి.. వివరణ కోరే అవకాశం కూడా లేదని షా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు రేప్ కేసులో శిక్షపడటంతో ఆయన మద్దతుదారుల దాడులు, విధ్వంసంతో హరియాణ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింస తలెత్తడంతో హైకోర్టు సైతం సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్న చూస్తూ మిన్నకుండిపోయారని ఖట్టర్‌ను హైకోర్టు మందలించింది. అయినప్పటికీ ఖట్టర్‌పై చర్య తీసుకోరాదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదాకు భారీ మద్దతు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున హింస తలెత్తకుండా ఖట్టర్ ప్రభుత్వం నియంత్రించగలిగిందని షా అభిప్రాయపడినట్టు సమాచారం. -
హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు
-
హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు
సాక్షి, హరియాణా: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హరియాణా సర్కారుకు శనివారం చివాట్లు పెట్టింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గుర్మీత్ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గుర్మీత్ ఆస్తుల వివరాలను ఈ నెల 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి. పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
రెచ్చిపోతే కఠినంగా వ్యవహరించండి: హైకోర్టు
సాక్షి, చంఢీఘర్ : డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ సింగ్ మద్దతు దారులపై హరియాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరూ చేసినా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో రెండు రాష్ట్రాలు గడగడలాడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుండడమే ఇందుకు కారణం. పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం రెండున్నరకు తుది తీర్పు వెల్లడించినుంది. దీంతో హర్యాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పంచ కులలో ఈ తీర్పు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది ఇక పంచకులకు గుర్మీత్ అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. రహదారులపై ఎటువైపు చూసినా ఆయన మద్దతుదారులే కనిపిస్తున్నారు. వేలాదిగా వచ్చిన గుర్మీత్ అనుచరులు ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. ఇప్పటికే సుమారు రెండులక్షల మందికి పైగా నామ్ చర్చా ఘర్కు చేరుకోగా సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. అలాగే గుర్మీత్ మద్ధతు దారులు నిరసనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి గుర్మీత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు తీర్పు గుర్మీత్‌కు వ్యతిరేంగా వస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డేరా సచ్ఛా సౌధాలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేశారని, పదునైన ఆయుధాలు దాచి పెట్టారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పంచకులతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. పంచకుల, చండీఘర్ సహా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని స్టేడియంలోకి తరలించారు. అలాగే పోలీసులకు అదనంగా ఇప్పటికే 15వేల పారా మిలిటరీ దళాలను మోహరించారు. ఒక్క పంచకులకే 177 కంపెనీల పారా మిలిటరీ దళాలను కేటాయించారు. సైన్యం కూడా పంచకులకు చేరుకుంది. రెండు రాష్ర్టాల్లోను 72 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సిర్సా పట్టణం తోపాటు మరో మూడు గ్రామాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో కార్యాలయాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు, ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి. పంజాబ్, హర్యానాలకు వచ్చే 29 రైళ్లను రద్దు చేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మిత్ సిర్సా నుంచి భారీ కాన్వాయ్‌తో పంచకుల బయల్దేరారు. ఈ కాన్వాయ్‌లో సుమారు రెండువందల వాహనాలు ఉన్నట్లు సమాచారం. అయితే తాము కేవలం రెండు వాహనాలను మాత్రమే పంచకులలోకి అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. -
వీడియో విడుదల చేసిన డేరా స్వచ్ఛ సౌదా చీఫ్
న్యూఢిల్లీ : రేప్ కేసుపై కోర్టు తీర్పు నేపథ్యంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీం సింగ్ శుక్రవారం తన మద్దతుదారులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో పంచకుల చేరుకున్న మద్దతుదారులంతా తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. శాంతియుతంగా, సంయమనం పాటించాలని గుర్మీత్ రామ్‌రహీం సింగ్ పిలుపునిచ్చారు. కాగా 2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు 'రాక్‌స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాంరహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో గుర్మిత్ రామ్‌రహీం సింగ్ మద్దతుదారులు పెద్దసంఖ్యలో పంచకుల చేరుకున్నారు. మరోవైపు పంచకుల కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా గుర్గాన్, ఫరిదాబాద్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతేకాకుండా శాంతిభద్రతల దృష్ట్యా 74 రైళ్లను రద్దు చేశారు. -
బాబాపై రేప్ కేసు : రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్
-
బాబాపై రేప్ కేసు: అట్టుడుకుతున్న 2 స్టేట్స్!
చండీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీం సింగ్‌పై నమోదైన రేప్ కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించబోతుండటంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. గుర్మీత్‌పై రేప్ కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో పంచకుల పట్టణానికి ఆయన మద్దతుదారులు పోటెత్తారు. ఇప్పటికే 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు పంచకులలోని ఆయన ఆశ్రమానికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. గుర్మీత్ మద్దతుదారులు రాకుండా పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేస్తున్నా.. పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు వస్తున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డేరా స్వచ్ఛ సౌదా మద్దతుదారులకు పిలుపునిచ్చారు. 2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు 'రాక్‌స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాంరహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాయలంలో తమపై లైంగిక దాడి జరిగిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. 2007లో విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలం సేకరించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను గుర్మీత్ ఖండించారు. పంచుకులలోని సీబీఐ కోర్టు శుక్రవారం ఈ కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పంచకులకు పెద్దసంఖ్యలో వస్తుండటంతో పోలీసులకు, నిఘా వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. -
జట్టు ఇంజనీర్ ఆశయం
‘ఎమ్.ఎస్.జి’ మూవీ ఫేమ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జట్టు ఇంజనీర్’. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇన్సాన్, హనీప్రీత్ ఇన్సాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను, ఒక పాటను హర్యానాలోని సిర్సాలో విడుదల చేశారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా ఐదో చిత్రం ‘జట్టు ఇంజనీర్’ ఒక శక్తివంతమైన సందేశంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఆశయసాధన కోసం జట్టు ఇంజనీర్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. గ్రామాల్లోని అమాయక ప్రజల జీవన విధానాన్ని చూపించాం. కేవలం పదిహేను రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశాం. భారతదేశంలోని అన్ని భాషల్లో మే 19న ఈ చిత్రం విడుదల చేస్తాం’’ అన్నారు. -
కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఇదే!
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విజయ రహస్యం ఏంటో తెలుసా? కఠోరశ్రమ, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్లే విరాట సక్సెస్ అయ్యాడని అందరూ అనుకుంటుంటే... కాదు అదంతా తన గొప్పతనమే అంటున్నారు ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. కోహ్లి విజయవంతమైన క్రికెటర్ కావడానికి తానే కారణం అంటున్నారు. బాలీవుడ్ గాసిప్ బ్లాగ్ స్పాట్ బాయితో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. 'మొదట్లో కోహ్లి మంచి ఆరంభాలను భారీ స్కోరులుగా మలచలేకపోయాడు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని, నేర్చుకోవడం కొనసాగించాలని అప్పుడు విరాట్ కు సలహాయిచ్చాను. అప్పటి నుంచి అతడు బాగా రాణిస్తున్నాడ'ని రహీమ్ సింగ్ అన్నారు. అక్కడితో ఆయన ఆగలేదు. టీమిండియాకు ఎంపికైన తర్వాత తనకు కోహ్లి థ్యాంక్స్ చెప్పాడని వెల్లడించారు. బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో కోహ్లి డబుల్ సెంచరీ బాదాడు. -
విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా!
న్యూఢిల్లీ: డెరా సచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వీడియోలో విష్ణుమూర్తిగా కనిపించి.. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆలిండియా హిందూ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'మేం చూసిన ఒక వీడియోలో గుర్మీత్ రాంరహీం విష్ణుమూర్తి అవతారంలో కనిపించారు. ఇది ప్రజల మత మనోభావాలను దెబ్బతీయడమే' అని ఫెడరేషన్ అధ్యక్షుడు నిషాంత్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల వివాదాస్పద బాబా రాంరహీంను టీవీషోలో అనుకరించి మిమిక్రీ చేసినందుకు హాస్యనటుడు కికూ షార్దాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కికూ షార్దా అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో రాంరహీంపై ఈ ఫిర్యాదు దాఖలు కావడం గమనార్హం.