కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఇదే! | Gurmeet Ram Rahim claims credit for Virat Kohli's incredible success | Sakshi
Sakshi News home page

కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఇదే!

Published Fri, Feb 10 2017 4:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఇదే!

కోహ్లి సక్సెస్ సీక్రెట్ ఇదే!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విజయ రహస్యం ఏంటో తెలుసా? కఠోరశ్రమ, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్లే విరాట సక్సెస్ అయ్యాడని అందరూ అనుకుంటుంటే... కాదు అదంతా తన గొప్పతనమే అంటున్నారు ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. కోహ్లి విజయవంతమైన క్రికెటర్ కావడానికి తానే కారణం అంటున్నారు. బాలీవుడ్ గాసిప్ బ్లాగ్ స్పాట్ బాయితో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.

'మొదట్లో కోహ్లి మంచి ఆరంభాలను భారీ స్కోరులుగా మలచలేకపోయాడు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని, నేర్చుకోవడం కొనసాగించాలని అప్పుడు విరాట్ కు సలహాయిచ్చాను. అప్పటి నుంచి అతడు బాగా రాణిస్తున్నాడ'ని రహీమ్ సింగ్ అన్నారు. అక్కడితో ఆయన ఆగలేదు. టీమిండియాకు ఎంపికైన తర్వాత తనకు కోహ్లి థ్యాంక్స్ చెప్పాడని వెల్లడించారు. బంగ్లాదేశ్‌ తో హైదరాబాద్ లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో కోహ్లి డబుల్ సెంచరీ బాదాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement