డేరాబాబాకు పారిపోయే ప్లాన్
సాక్షి, చండీగఢ్ : హర్యానా పోలీసులు తాజాగా మరో అరెస్టులు చేశారు. అయితే, వారు అరెస్టు చేసింది మాత్రం పోలీసులనే. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషి అని తేల్చిన తర్వాత కూడా అతడిని పారిపోయేందుకు సహాయం చేసిన ముగ్గురు పోలీసులను ద్రోహంవంటి ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు.
వారిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉండగా మరొకరు కానిస్టేబుల్. ప్రస్తుతం వారిని విచారణలో భాగం చేసినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 25న పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. ఆ సమయంలో వారు గుర్మీత్‌కు ఆయన భద్రతకు సంబంధించిన వివరాలు తెలియజేసి ఆయన పారిపోయేందుకు కుట్రలు చేశారు. ప్రస్తుతం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన వారిని మూడు రోజులపాటు విచారించనున్నారు.